Mehbooba Mufti: కశ్మిరీలకు ఎలాంటి హక్కు లేదు, వారి గోడు చెప్పుకున్నా వినే దిక్కు లేదు

రాష్ట్రంలో ఎన్నడూ లేనంత అవినీతి పెరిగింది. ఏ ప్రభుత్వ కార్యాలయానికి వెళ్లినా లంచం ఇస్తే కానీ పని జరిగే పరిస్థితి కనిపించడం లేదు. ఇక కేంద్ర ప్రభుత్వ విధానాలు రాష్ట్రాన్ని మరింత ఇబ్బందుల్లోకి నెడుతున్నారు. కశ్మీరీ పండిట్లు తమ గొంతు వినిపించడం కోసం ఆయుధాలు పట్టే పరిస్థితి వస్తోంది. గతంలో వీరి కోసం మాట్లాడామని చెప్పుకునే వారే నేడు వారిని మరింత అణచివేస్తున్నారు

Mehbooba Mufti: జమ్మూ కశ్మిరీల జీవన స్థితిపై లెఫ్టినెంట్ గవర్నర్ పరిపాలనా విభాగాన్ని మాజీ ముఖ్యమంత్రి, పీపుల్స్ డెమొక్రటిక్ పార్టీ అధినేత మెహబూబా ముఫ్తీ తప్పు పట్టారు. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ట్ర పరిపలనా విభాగాల కారణంగా రాష్ట్ర ప్రజలు నడిరోడ్డు మీదకు రావాల్సి వచ్చిందని ఆమె అన్నారు. రాష్ట్ర ప్రజలకు ఎలాంటి హక్కులూ లేవని, వారి మనోవేధనను చెప్పుకునే దిక్కే లేదని ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం ఓ కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.

‘‘రాష్ట్రంలో ప్రజలు అనేక కష్టాలు ఎదుర్కొంటున్నారు. కానీ లెఫ్టినెంట్ గవర్నర్‭కు అవేవీ పట్టడం లేదు. రాష్ట్రానికి భారతీయ జనతా పార్టీ ఏం చేసిందని చెప్పుకునే బిజీలోనే వారు ఉన్నారు. ఈరోజు రాష్ట్ర ప్రజలంతా నడిరోడ్డు మీద నిల్చున్నారు. వారికి నోరు తెరిచే అవకాశమే లేదు. వారికంటూ ఎలాంటి హక్కు లేదు. వారి ఆవెదన వినే పరిస్థితి లేదు. ఎవరికి వారి గోడు చెప్పుకోలేక తమలో తామే కుంగిపోతున్నారు’’ అని మెహబూబా అన్నారు.

ఇంకా ఆమె మాట్లాడుతూ ‘‘రాష్ట్రంలో ఎన్నడూ లేనంత అవినీతి పెరిగింది. ఏ ప్రభుత్వ కార్యాలయానికి వెళ్లినా లంచం ఇస్తే కానీ పని జరిగే పరిస్థితి కనిపించడం లేదు. ఇక కేంద్ర ప్రభుత్వ విధానాలు రాష్ట్రాన్ని మరింత ఇబ్బందుల్లోకి నెడుతున్నారు. కశ్మీరీ పండిట్లు తమ గొంతు వినిపించడం కోసం ఆయుధాలు పట్టే పరిస్థితి వస్తోంది. గతంలో వీరి కోసం మాట్లాడామని చెప్పుకునే వారే నేడు వారిని మరింత అణచివేస్తున్నారు’’ అని విమర్శించారు. ‘‘మన అస్థిత్వం మనకు కావాలి, మన హక్కులు మనకు కావాలి, మనకు గౌరవం కావాలి, మనకు స్వేచ్ఛ కావాలి. వీటన్నటి కోసం మన ఐక్యంగా పోరాడాలి’’ అని కశ్మిరీలకు ముఫ్తీ పిలుపునిచ్చారు.

Leader Of Thieves: నా శాఖలో అందరూ దొంగలే, నేను ఆ దొంగలకు లీడర్‭ని.. మంత్రి సంచలన వ్యాఖ్యలు

ట్రెండింగ్ వార్తలు