జమ్మూ కాశ్మీర్ లో ఎన్ కౌంటర్ : ఇద్దరు ఉగ్రవాదులు హతం

జమ్మూ కాశ్మీర్ లో జరిగిన ఎన్ కౌంటర్ లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు.  పుల్వామా జిల్లాలోని బండోజా ఏరియాలో ఉగ్రవాదులకు భద్రతా దళాలకు మధ్య  మంగళవారం తెల్లవారుఝూమున  5గంటలనుంచి  ఎదురు కాల్పులు జరుగుతున్నాయి.

ఇప్పటివరకు ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. ఒక  సీఆర్పీఎఫ్  జవానుకు బుల్లెట్ గాయాలు కాగా అతడిని ఆస్పత్రికి తరలించారు. ఘటనా స్ధలం నుంచి 2 ఏకే 47 తుపాకులను పోలీసుల స్వాధీనం చేసుకున్నారు. కాల్పులు కొనసాగుతున్నాయి.

బండోజాలో ఉగ్ర‌వాదులు దాగి ఉన్నార‌న్న విశ్వసనీయ స‌మాచారం మేరకు జ‌మ్మూకాశ్మీర్ పోలీసులు, భ‌ద్ర‌తాదళాలు  సంయుక్తంగా గాలింపు చేప‌ట్టాయి. ఉగ్ర‌వాదులు దాగి ఉన్న ప్ర‌దేశాన్ని చుట్టుముట్టి లొంగిపోవాల‌ని హెచ్చరించ‌గా.. అటువైపు నుంచి కాల్పులు మొద‌ల‌య్యాయి. దీంతో భ‌ద్ర‌తాదళాలు కూడా ఎదురుకాల్పులు జ‌రిపాయి.

Read: గాల్వాన్ లోయ..అటు వెయ్యి మంది..ఇటు వెయ్యి మంది, ఏం జరగనుంది ?