Jammu kashmir election 2024
Jammu kashmir election 2024 : జమ్మూకశ్మీర్‌లో రెండో విడత పోలింగ్ కొనసాగుతుంది. పీర్ పంజాల్ పర్వత శ్రేణికి ఇరువైపులా ఉన్న శ్రీనగర్, బడ్ గామ్, రాజౌరీ, పూంఛ్, గండేర్ బల్, రియాసీ జిల్లాల్లోని 26 నియోజకవర్గాల్లో పోలింగ్ కొనసాగుతోంది. మొత్తం 239 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. ఈ ఎన్నికల్లో మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా, బీజేపీ జమ్మూ కశ్మీర్ చీఫ్ రవీందర్ రైనా, ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు తారిఖ్ హమీద్ కర్రా సహా పలువురు కీలక నేతలు పోటీలో ఉన్నారు.
బుధవారం ఉదయం 7గంటల నుంచి పోలింగ్ ప్రారంభమైంది. సాయంత్రం 6గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది. ఓటర్లు ఉదయం నుంచే పోలింగ్ కేంద్రాల వద్దకు చేరుకొని తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. పలువురు రాజకీయ, వివిధ రంగాల ప్రముఖులు ఉదయాన్నే పోలింగ్ కేంద్రానికి వచ్చి ఓటు వేశారు. 26 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 3,500 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద పటిష్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. 13వేల మందికిపైగా పోలింగ్ సిబ్బందిని నియమించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భారీ సంఖ్యలో పోలీసులు, సాయుధ పోలీసు బలగాలు, కేంద్ర సాయుధ పారామిలటరీ బలగాలను మోహరించారు. రెండో విడత పోలింగ్ ప్రశాంత వాతావరణంలో జరిగేలా ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద మూడంచెల భద్రతను ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు.
జమ్మూకాశ్మీర్ లో పదేళ్ల తరువాత అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. మొత్తం 90 అసెంబ్లీ స్థానాలు ఉండగా.. మొదటి విడత పోలింగ్ 24అసెంబ్లీ స్థానాలకు సెప్టెంబర్ 18న పూర్తయింది. 61.38శాతం మంది ఓటు హక్కు నమోదు చేసుకున్నారు. రెండో దశలో 26 స్థానాలకు ఇవాళ పోలింగ్ జరుగుతుంది. మూడో దశలో 40 అసెంబ్లీ నియోజకవర్గాలకు అక్టోబర్ 1న పోలింగ్ జరగనుంది.
#WATCH | J&K: People queue up at a polling station in Budgam Assembly constituency to vote in the second phase of the Assembly elections today.
Eligible voters in 26 constituencies across six districts of the UT are exercising their franchise today.
(Visuals from polling… pic.twitter.com/ZhaBRFmUSa
— ANI (@ANI) September 25, 2024