Pahalgam Terror Attack: పహల్గాం దాడి ఉగ్రవాదుల కోసం పోలీస్, భద్రతా బలగాలు ముమ్మరంగా గాలింపు చేపట్టాయి. ప్రత్యేక బలగాలు వారిని పట్టుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. ఈ క్రమంలో ముష్కరులను పట్టుకునేందుకు జమ్ముకశ్మీర్ పోలీసులు రివార్డ్ ప్రకటించారు. టెర్రరిస్టుల ఆచూకీ తెలిపిన వారికి 20 లక్షల రూపాయల బహుమతి ఇస్తామని అనంత్ నాగ్ పోలీసులు ప్రకటించారు.
Also Read: భారత్-పాకిస్థాన్ మధ్య హైటెన్షన్.. పాక్ బందీగా భారత్ జవాన్.. ఏం జరగనుంది..
మంగళవారం మధ్యాహ్నం పహల్గాం దాడికి పాల్పడిన వారి ఊహాచిత్రాలను ఇప్పటికే విడుదల చేయగా, వీరిలో పాకిస్తాన్ జాతీయులు ఉన్నట్లు భావిస్తున్నారు అధికారులు. ఆరుగురు లేదా ఏడుగురు టెర్రరిస్టులు ఈ దాడిలో పాల్గొన్నారని, వీరిలో లష్కరే తొయిబా ఉగ్రవాదులు ఆదిల్ హుస్సేన్, అలీ భాయ్, హషీమ్ మూసాలు ఉన్నట్లు తెలుస్తోంది. వారిని పట్టుకోవడానికి సహకరించిన వారికి 20 లక్షల బహుమతి ప్రకటించారు అనంత్ నాగ్ పోలీసులు.
మంగళవారం కశ్మీర్‌లోని పహల్గాంలో ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. 26 మందిని కాల్చి చంపారు. వారిలో ఎక్కువగా పర్యాటకులు ఉన్నారు. 2019 లో పుల్వామా దాడి తర్వాత లోయలో జరిగిన అత్యంత ఘోరమైన దాడి ఇది. జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) బృందం దాడి జరిగిన ప్రదేశానికి చేరుకుంది. దర్యాఫ్తును ముమ్మరం చేసింది. డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ జనరల్ స్థాయి అధికారి నేతృత్వంలోని NIA బృందం బైసరన్‌ను సందర్శించింది. పర్యాటకులపై కాల్పులకు పాల్పడిన ఉగ్రవాదుల్లో ముగ్గురు పాకిస్తాన్ పౌరులు, ఇద్దరు జమ్ముకశ్మీర్ నివాసితులు ఉన్నారని తెలుస్తోంది.