గాడ్సే నిజమైన దేశభక్తుడు : నాగబాబు సంచలన కామెంట్స్ 

  • Publish Date - May 19, 2020 / 01:31 PM IST

మహాత్మాగాంధీని హత్య చేసిన నాథూరాం గాడ్సే పై సినీనటుడు, జనసేన నేత నాగబాబు సంచలన  కామెంట్స్ చేశారు. గాడ్సే  నిజమైన దేశభక్తుడని ట్వీట్ చేశారు. గాడ్సే దేశభక్తిని ఎవరూ శంకించలేరని ఆయన అన్నారు. ఈ ట్వీట్ ఇప్పుడ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

గాంధీని హత్య చేయటం సరైనది అనటంలేదు, తప్పుకూడా కావచ్చు అంటూ నాగబాబు ట్వీట్ చేశారు. గాంధీ మహానుభావుడు….ఆయన అంటే నాకు అభిమానం అని చెప్తూనే, మరోవైపు నాథూరాం గాడ్సే నిజమైన దేశభక్తుడంటూ నాగబాబు చేసిన ట్వీట్ హాట్ టాపిక్ గా మారింది.  

“ఈ రోజు నాధురాం గాడ్సే పుట్టిన రోజు.నిజమైన దేశ భక్తుడు.గాంధీ ని చంపడం కరెక్టా కదా అనేది debatable. కానీ అతని వైపు ఆర్గ్యుమెంట్ ని ఆ రోజుల్లో ఏ మీడియా కూడా చెప్పలేదు.కేవలం మీడియా అధికార ప్రభుత్వానికి లోబడి పనిచేసింది.(ఈ రోజుల్లో కూడా చాలా వరకు ఇంతే).గాంధీ ని చంపితే ఆపఖ్యాతి పాలౌతానని తెలిసినా తను అనుకున్నది చేసాడు.కానీ నాధురాం దేశభక్తి ని శంకించలేము.ఆయన ఒక నిజమైన దేశభక్తుడు.ఆయన పుట్టిన రోజు సందర్భంగా ఆయనని ఒక సారి గుర్తుచేసుకోవలనిపించింది.పాపం నాధురాం గాడ్సే…మే హిస్ సోల్ రెస్ట్ ఇన్ పీస్” అంటూ తన ట్విట్టర్లో నాగబాబు పేర్కోన్నారు.