జేఈఈ మెయిన్స్ తుది విడత పరీక్ష ఇవాళ(7 మార్చి 2019) జరగనుంది. ఎన్‌ఐటీలో ప్రవేశానికి, జేఈఈ అడ్వాన్స్‌డ్‌కు అర్హత సాధించేందుకు జాతీయ పరీక్షల సంస్థ(ఎన్‌టీఏ) ఈ పరిక్షను నిర్వహిస్తోంది. మొదటి రోజు బీఆర్క్, బీ ప్లానింగ్ కోర్సుల్లో ప్రవేశానికి పేపర్-2 పరీక్ష జరుగుతుంది. బీఈ/బీటెక్ కోర్సుల్లో ప్రవేశాలు కోరుకునే వారికి ఈనెల 8, 9, 10, 12 తేదీల్లో పేపర్-1 నిర్వహిస్తారు. దేశవ్యాప్తంగా సుమారు 10లక్షల మంది ఈ పరిక్షకు హాజరు కానున్నారు.
తెలుగు రాష్ట్రాల నుంచి 1లక్ష 30వేల మంది పరీక్ష రాసే అవకాశం ఉంది. జేఈఈ మెయిన్స్ తొలి విడత పరీక్షను ఈ ఏడాది జనవరిలో జరిపారు. అదే నెలలో ఫలితాలు విడుదల చేశారు కానీ ర్యాంకులు ఇవ్వలేదు. ఈసారి పరీక్ష పూర్తయ్యాక రెండు పరీక్షల్లో వచ్చిన ఉత్తమ స్కోర్‌ను బట్టి ర్యాంకులు కేటాయిస్తారు. ఏప్రిల్ 30వ తేదీన ర్యాంకులు విడుదల చేస్తారు. ఆన్‌లైన్ పరీక్షలు కావడంతో వివిధ నగరాలు, పట్టణాల్లో పరీక్షా కేంద్రాలును ఏర్పాటు చేశారు.