JEE Main Exam 2021 : జేఈఈ మెయిన్ పరీక్ష వాయిదా

కరోనా నేపథ్యంలో దేశంలో మరో పరీక్ష వాయిదా పడింది. ఇంజినీరింగ్‌లో ప్రవేశాల కోసం ఈనెల 24 నుంచి 28వ తేదీ వరకు జరగాల్సిన

JEE Main కరోనా నేపథ్యంలో దేశంలో మరో పరీక్ష వాయిదా పడింది. ఇంజినీరింగ్‌లో ప్రవేశాల కోసం ఈనెల 24 నుంచి 28వ తేదీ వరకు జరగాల్సిన జేఈఈ- మెయిన్ 2021 పరీక్ష వాయిదా వేస్తూ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(NTA)నిర్ణయం తీసుకుంది. NTA అధికారిక ప్రకటన ప్రకారం..మే-2021 సెషన్ కోసం రిజిస్ట్రేషన్ తరువాతి దశలో ప్రకటించబడుతుంది మరియు ఏప్రిల్ మరియు మే సెషన్ల రీ షెడ్యూల్ కూడా తరువాత జరుగుతుంది.

కరోనా తీవ్రత కారణంగా విద్యార్థుల యోగక్షేమాలను దృష్టిలో ఉంచుకొనే జేఈఈ మెయిన్ పరీక్ష వాయిదావేస్తూ నిర్ణయం తీసుకున్నట్టు కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేష్ పోఖ్రియాల్ ట్వీట్ చేశారు.తదుపరి అప్ డేట్స్ కోసం విద్యార్థులు NTA అధికారిక వెబ్ సైట్ ను ఫాలో అవుతుండాలని మంత్రి సూచించారు. మరోవైపు, ఇప్పటికే నీట్ పీజీ ఎగ్జామ్ ను వాయిదా వేసిన విషయం తెలిసిందే.

ట్రెండింగ్ వార్తలు