JEE Mains Topper In Assam Arrested : దేశ వ్యాప్తంగా ఐఐటీ వంటి ప్రఖ్యాత ఇంజనీరింగ్ కాలేజీల్లో ప్రవేశాల కోసం ఉద్దేశించిన జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (మెయిన్) పరీక్షలో టాపర్‌గా నిలిచిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. తాను కాకుండా..మరొకరి చేత పరీక్ష రాయించాడు. ఈ ఘటన అస్సాంలో చోటు చేసుకుంది. నీల్ నక్షత్ర దాస్ అస్సాంలో టాపర్ గా నిలిచాడు.
అయితే..నీల్ నక్షత్ర దాస్ మరొకరి చేత పరీక్ష రాయించినట్లు పోలీసులు గుర్తించారు. అజారా పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అతని తండ్రి డాక్టర్ జ్యోతిర్మయి దాస్ లతో పాటు పరీక్ష కేంద్రంలోని ముగ్గురు ఉద్యోగులు Hamendra Nath Sarma, Pranjal Kalita, Hirulal Pathak అదుపులో తీసుకున్న వారిలో ఉన్నారు.
బుధవారం అదుపులోకి తీసుకున్నారు. ఈ పరీక్షల్లో అతను 99.8 శాతం స్కోర్ సాధించాడు. ఈ స్కోర్ తో ప్రతిష్టాత్మక ఐఐటీలతో పాటు దేశంలోని టాప్ ఇంజినీరింగ్ కాలేజీలో ప్రవేశం పొందే అవకాశం ఉంది. గురువారం వీరిని కోర్టులో హాజరు పరుస్తామని వెల్లడించారు. ఈ కేసులో ఇతరుల ప్రమేయం ఉందా అనే దానిపై దర్యాప్తు చేస్తున్నామని Guwahati Police Commissioner MP Gupta వెల్లడించారు.
జేఈఈ ఇన్విజిలేటర్ సహాయం చేసినట్లు గుర్తించామని, పరీక్షా రోజున నిందితుడు తన పేరు, రోల్ నెంబర్ ను రాయడానికి పరీక్ష కేంద్రంలోకి వెళ్లాడని తెలిపారు. పరీక్ష కేంద్రానికి సీలు వేసి మేనెజ్ మెంట్ ను ప్రశ్నించామన్నారు. ఈ ఘటనపై నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (National Testing Agency (NTA) కు సమాచారం ఇచ్చారు.