Jet Airways : జెట్ ఎయిర్ వేస్ పునరుద్ధరణ ప్లాన్ కి NCLT ఆమోదం

1990ల నుంచి 2000ల వరకూ భారతదేశ విమానయాన రంగానికి ముఖచిత్రంగా మెరిసిపోయి ఓ వెలుగు వెలిగిన విమానయాన సంస్థ జెట్ ఎయిర్..బ్యాంకుల నుంచి తీసుకున్న అప్పులు కట్టలేక కొన్నేళ్లుగా తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటోన్న విషయం తెలిసిందే.

Jet Airways 1990ల నుంచి 2000ల వరకూ భారతదేశ విమానయాన రంగానికి ముఖచిత్రంగా ఓ వెలుగు వెలిగిన విమానయాన సంస్థ జెట్ ఎయిర్ వేస్..బ్యాంకుల నుంచి తీసుకున్న అప్పులు కట్టలేక కొన్నేళ్లుగా తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటోన్న విషయం తెలిసిందే. అయితే ఆకాశమంత ఎత్తుకు ఎదిగి కుప్పకూలిపోయిన జెట్ ఎయిర్ వేస్ కి మళ్లీ మంచి రోజులు మొదలయ్యాయి.

లండన్ కు చెందిన కల్రాక్ కేపిటల్ మరియు యూఏఈకి చెందిన వ్యాపారవేత్త మురారీ లాల్ జలాన్ లతో కూడిన కన్సార్టియం సమర్పించిన జెట్ ఎయిర్ వేస్ పునరుద్ధరణ ప్లాన్ కి నేషనల్ కంపెనీస్ లా ట్రిబ్యునల్(NCLT)మంగళవారం ఆమోదం తెలిపింది. పునరుద్ధరణ ప్లాన్ లో భాగంగా..జెట్ ఎయిర్ వేస్ కి స్లాట్ లు కేటాయించేందుకు డీజీసీఏ(Director General of Civil Aviation)మరియు విమానాయాన మంత్రిత్వశాఖకి NCLT 90 రోజుల గడువు ఇచ్చింది.

అయితే, ఇప్పుడు జెట్ ఎయిర్‌వేస్‌కు చారిత్రాత్మక మార్గాలు ఇచ్చే విషయం ఇంకా పరిష్కరించబడలేదని మరియు దాని దేశీయ మరియు అంతర్జాతీయ మార్గాలను నిర్ణయించడానికి మరిన్ని చర్చలు అవసరమని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. రూట్ల విషయమై జెట్ ఇంకా చర్చలు జరపుతుందని,దాని అన్ని పాత రూట్లను జెట్ పొందే అవకాశం లేదని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. అయితే దేశ రాజధానిలో మాత్రం తన పాత రెవెన్యూ స్లాట్ లలో చాలా వాటిని జెట్ తిరిగే పొందే అవకాశముందని తెలుస్తోంది. ఈ ఏడాది చివరికల్లా జెట్ ఎయిర్ వేస్ ఎగిరేందుకు సిద్దంగా ఉందని..మొదట్లో దేశీయ రూట్లలో,ఆ తర్వాత క్రమంగా విదేశీ రూట్లలో జెట్ ఎయిర్ వేస్ విమానాలు ఎగరనున్నట్లు సమాచారం.

వాస్తవానికి ముంబై మరియు ఢిల్లీ వంటి అత్యంత రద్దీ విమానాశ్రయాల్లో ల్యాండ్ అయ్యేందుకు మరియు ఎగిరేందుకు అనుమతించబడేలా జెట్ ఎయిర్ వేస్ కి గతంలో 700 టైమ్ స్లాట్ లు ఉండేవి. అయితే 2019లో జెట్ ఎయిర్ వేస్ తన ఆపరేషన్స్ ని నిలిపివేయడంతో దాని స్లాట్ లను ఇతర విమానయానసంస్థలకు కేటాయించారు అధికారులు.

ట్రెండింగ్ వార్తలు