జార్ఖాండ్ ఎన్నికల ఫలితాలు: ముఖ్యమంత్రిగా హేమంత్‌.. ప్రకటించిన కాంగ్రెస్

  • Publish Date - December 23, 2019 / 06:54 AM IST

జార్ఖండ్‌ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు క్షణక్షణం మారిపోతూ ఉన్నాయి. ప్రస్తుతం అధికార భారతీయ జనతా పార్టీ 28 స్థానాలతో అతిపెద్ద పార్టీగా కొనసాగుతుండగా.. కాంగ్రెస్‌ కూటమి 42 స్థానాలతో అధాకారం చేపట్టేందుకు సరిపడ స్థానాల్లో లీడింగ్‌లో ఉంది. కాంగ్రెస్‌-జేఎంఎం కూటమి మెజార్టీ మార్క్‌ దాటి ఆధిక్యం దిశగా దూసుకెళ్లింది.

ఈ క్రమంలోనే ముందుగా ప్రకటించినట్లుగా జేఎంఎం కార్యనిర్వాహక అధ్యక్షుడు హేమంత్‌ సోరేన్‌ తమ కూటమి తరఫున ముఖ్యమంత్రి అభ్యర్థి అని కాంగ్రెస్ కూటిమి నేతలు ప్రకటించారు. మరోవైపు ఏజేఎస్‌యూ, జేవీఎంలతో కాంగ్రెస్, బీజేపీ మంతనాలు జరుపుతుంది. అయితే వారి మద్దతు ఎవరికి ఉంటుంది అనేది ఇప్పటివరకు అర్థం కాలేదు. 

ఇక ముఖ్యమంత్రి రఘుబర్ దాస్‌ స్వల్ప మెజారిటీతో ముందంజలో కొనసాగుతున్నారు. ఇక రెండు స్థానాల్లో పోటీ చేస్తున్న హేమంత్‌ సోరేన్‌ బర్‌హేట్‌లో ఆధిక్యంలో కొనసాగుతుండగా.. దుమ్‌కాలో వెనకబడ్డారు. ప్రస్తుతం మొత్తం 81 స్థానాలకు గానూ కాంగ్రెస్ కూటమి 42, బీజేపీ 29, జేవీఎం 4, ఏజేఎస్‌యూ 2, ఇతరుల నాలుగు స్థానాల్లో ఆధిక్యతను ప్రదర్శిస్తున్నారు. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన సంఖ్య 42.