Jharkhand Vaccines Doses : జార్ఖండ్‌లో తీవ్రంగా వ్యాక్సిన్ కొరత.. ఇంకా 3 రోజుల డోసులే మిగిలాయి!

జార్ఖండ్‌లో కరోనావైరస్ వ్యాక్సిన్ కొరత తీవ్రంగా ఉంది.  రాష్ట్రంలో 18-44  ఏళ్ల గ్రూపుకు మూడు రోజుల వ్యాక్సిన్ మాత్రమే మిగిలి ఉందని  ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ చెప్పారు.

Jharkhand COVID Vaccines Shortage : జార్ఖండ్‌లో కరోనావైరస్ వ్యాక్సిన్ కొరత తీవ్రంగా ఉంది.  రాష్ట్రంలో 18-44  ఏళ్ల గ్రూపుకు మూడు రోజుల వ్యాక్సిన్ మాత్రమే మిగిలి ఉందని  ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ చెప్పారు. కొవిడ్ వ్యాక్సిన్ల కొరతను జార్ఖండ్ ఎదుర్కొంటున్నదని, 18-44 గ్రూపులకు మూడు రోజుల టీకా మాత్రమే మిగిలి ఉందని ఆయన అన్నారు.

సోరెన్ రాష్ట్రంలోని COVID పరిస్థితిపై రాష్ట్ర మంత్రులతో సీఎం సమావేశమయ్యారు. కరోనా గణాంకాల ప్రకారం.. రాష్ట్రంలో ఇప్పుడు 22,566 యాక్టివ్ కేసులు ఉండగా, 3,01,705 మంది బాధితులు  కరోనా నుంచి కోలుకున్నారని హెల్త్ బులెటిన్ పేర్కొంది.

రెండవ వేవ్ సమయంలో COVID-19 కేసుల తీవ్రతతో పాటు రాష్ట్ర ప్రభుత్వం మే 27 వరకు లాక్‌డౌన్ పొడిగించింది. జార్ఖండ్‌లో COVID-19 కు సంబంధించి 80,59,453 శాంపిల్స్ పరీక్షించారు. దేశంలో కరోనా మరణాల రేటు 1.45 శాతంగా ఉంది. కరోనావైరస్ పోరాటం విజయవంతం  చేయాలంటే రాష్ట్రంలో పాక్షిక లాక్డౌన్ కఠినంగా అమలు చేయాల్సిన అవసరం ఉందని సోరెన్ చెప్పారు. వాస్తవ డేటాను రిపోర్ట్ చేస్తున్నందున రాష్ట్రంలో COVID సంఖ్యలు ఎక్కువగా ఉన్నాయని ఆయన అన్నారు.

మహమ్మారి మూడవ వేవ్ ఎదుర్కోనేందుకు రాష్ట్ర యంత్రాంగాలు సిద్ధంగా ఉండాలని అన్నారు.  ఆసుపత్రుల్లో కరోనా మరణాల సరైన గణాంకాలను సమర్పించామన్నారు. అందువల్ల తమ రాష్ట్రంలో కరోనా మరణాల సంఖ్య ఎక్కువగా ఉన్నాయని సీఎం సోరెన్ అన్నారు.

ట్రెండింగ్ వార్తలు