OBC Reservations: ఓబీసీ రిజర్వేషన్లను 14 నుంచి 27 శాతానికి పెంచిన జార్ఖండ్ ప్రభుత్వం

అంతే కాకుండా 1932 నాటి భూ రికార్డుల ఆధారంగా స్థానిక నివాసులను గుర్తించేందుకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. హేమంత్ సోరెన్‭పై అనర్హత వేటు వేయాలంటూ రాష్ట్రంలో కొనసాగుతున్న రాజకీయ అనిశ్చితి నడుమ ఈ నిర్ణయం రావడం గమనార్హం. ఆపరేషన్ కమల ఆరోపణల నేపధ్యంలో కొద్ది రోజుల క్రితమే అసెంబ్లీ సాక్షిగా తన బలాన్ని నిరూపించుకున్న సోరెన్.. రాజకీయంగా బీజేపీని మరింత దెబ్బకొట్టాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది

OBC Reservations: వెనుకబడిన వర్గాలకు సాధికారత కల్పించడంలో భాగంగా.. మండల్ కమిషన్ ఇచ్చిన నివేదికను అమలు చేయాలని జార్ఖండ్ ప్రభుత్వం నిర్ణయించింది. మండల్ కమిషన్ సూచించిన విధంగా ప్రభుత్వ ఉద్యోగాల్లో ఓబీసీ(ఇతర వెనుకబడిన వర్గాలు)లకు 27 శాతం రిజర్వేషన్ అమలు చేయాలని జార్ఖండ్ కేబినెట్ బుధవారం తీర్మాణం చేసింది. ఇంతకు ముందు ఈ రిజర్వేషన్ కేవలం 14 శాతం మాత్రమే ఉండేది. కాగా, తాజాగా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో 27 శాతం ఉద్యోగాలు ఓబీసీలకు రానున్నాయి.

షెడ్యూల్డ్ క్యాస్ట్, షెడ్యూల్డ్ ట్రైబ్, వెనుకబడిన తరగతులు, ఇతర వెనుకుబడిన తరగతులు, ఆర్థికంగా వెనుకబడిన తరగతులకు చెందిన వారికి ప్రభుత్వ ఉద్యోగాల్లో 77 శాతం వాటా దక్కేలా వచ్చిన ప్రతిపాదనకు సెప్టెంబర్ 14న రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలిపినట్లు ఒక అధికారి తెలిపారు. బుధవారం రాష్ట్ర ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ అధ్యక్షతన కేబినెట్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలోనే ఓబీసీ రిజర్వేషన్లకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

అంతే కాకుండా 1932 నాటి భూ రికార్డుల ఆధారంగా స్థానిక నివాసులను గుర్తించేందుకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. హేమంత్ సోరెన్‭పై అనర్హత వేటు వేయాలంటూ రాష్ట్రంలో కొనసాగుతున్న రాజకీయ అనిశ్చితి నడుమ ఈ నిర్ణయం రావడం గమనార్హం. ఆపరేషన్ కమల ఆరోపణల నేపధ్యంలో కొద్ది రోజుల క్రితమే అసెంబ్లీ సాక్షిగా తన బలాన్ని నిరూపించుకున్న సోరెన్.. రాజకీయంగా బీజేపీని మరింత దెబ్బకొట్టాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. దాంట్లో భాగంగానే సడెన్ గా ఓబీసీ రిజర్వేషన్ల అంశాన్ని తెరపైకి తీసుకువచ్చారని అంటున్నారు.

Bengusarai Killers: కనిపించిన వారిపై కాల్పుల మోత.. నిందితుల ఫొటోలు విడుదల చేసిన పోలీసులు

ట్రెండింగ్ వార్తలు