Bengusarai Killers: కనిపించిన వారిపై కాల్పుల మోత.. నిందితుల ఫొటోలు విడుదల చేసిన పోలీసులు

ఈ కాల్పుల్లో చందన్‌ కుమార్‌ అనే యువకుడు చనిపోగా, 11 మంది తీవ్రంగా గాయపడ్డారు. మరో 10 మంది ఈ ప్రమాదం నుంచి తప్పించుకోగలిగారు. దుండగులు అలా కాల్చుకుంటూ దాదాపు 8 కిలోమీటర్ల దూరం వెళ్లారు. మధ్యలో రెండు మూడు చెక్‌పోస్టులు కూడా దాటారు. అయినప్పటికీ వారిని పోలీసులు ఆపకపోవడం గమనార్హం. ఈ నేపథ్యంలో ఆ ప్రాంతంలో పెట్రోలింగ్‌ విధుల్లో ఉన్న ఏడుగురు పోలీసులను సస్పెండ్‌ చేశారు.

Bengusarai Killers: కనిపించిన వారిపై కాల్పుల మోత.. నిందితుల ఫొటోలు విడుదల చేసిన పోలీసులు

Police release photos of suspects who opened fire in Begusarai

Bengusarai Killers: బిహార్‭ రాజధాని బెగుసరాయిలో విచ్చలవిడిగా కాల్పులు జరుపుతూ తీవ్ర భయాందోళన సృష్టించడమే కాకుండా ఒక యువకుడి మరణానికి కారణమైన ఇద్దరు దుండగుల ఫొటోలను పోలీసులు విడుదల చేశారు. సిసిటీవీ కెమెరా ఆధారంగా తీసుకున్న ఈ ఫొటోలను బుధవారం పోలీసులు విడుదల చేశారు. వీరి ఆచూకీ చెప్పిన వారికి 50,000 రూపాయల నగదు బహుమతి ఇస్తామని ప్రకటించారు.

విషయంలోకి వెళ్తే.. బెగుసరాయిలో మంగళవారం ఇద్దరు దుండగుటు తుపాకులు చేతబట్టి బైక్ మీద వెళ్తూ తమకు కనిపించినవారిని కాల్చుకుంటూ వెళ్లారు. ఈ కాల్పుల్లో చందన్‌ కుమార్‌ అనే యువకుడు చనిపోగా, 11 మంది తీవ్రంగా గాయపడ్డారు. మరో 10 మంది ఈ ప్రమాదం నుంచి తప్పించుకోగలిగారు. దుండగులు అలా కాల్చుకుంటూ దాదాపు 8 కిలోమీటర్ల దూరం వెళ్లారు. మధ్యలో రెండు మూడు చెక్‌పోస్టులు కూడా దాటారు. అయినప్పటికీ వారిని పోలీసులు ఆపకపోవడం గమనార్హం. ఈ నేపథ్యంలో ఆ ప్రాంతంలో పెట్రోలింగ్‌ విధుల్లో ఉన్న ఏడుగురు పోలీసులను సస్పెండ్‌ చేశారు.

సమీపంలోని నాలుగు పోలీసు స్టేషన్లకు సమాచారం అందించి, విచారణను వేగవంతం చేసి వీలైనంత తొందరలో ఇద్దరు నిందితులను పట్టుకునే ప్రయత్నం చేస్తామని బెగుసరాయి జిల్లా ఎస్పీ యోగేంద్ర కుమార్ తెలిపారు.

Lakhimpur Kheri: మైనర్ అక్కాచెల్లెళ్లపై అత్యాచారం.. అనంతరం వారి చున్నీలతోనే చెట్టుకు ఉరి