అమరజవాన్లకు ఘన నివాళి…స్మారక స్థూపం వద్ద సైనికుల ఇంటి నుంచి సేకరించిన మట్టి

గ‌త ఏడాది ఫిబ్రవరి-14న కశ్మీర్ లోని పుల్వామాలో పాక్ ఉగ్రసంస్థ జైషే మొహమ్మద్ జ‌రిపిన ఉగ్ర‌వాడిలో 40 మంది సీఆర్‌పీఎఫ్ జ‌వాన్లు మృతిచెందిన విష‌యం తెలిసిందే. ఉగ్రదాడిలో మృతి చెందిన జవాన్లకు శుక్రవారం(ఫిబ్రవరి-14,2020)సీఆర్పీఎఫ్ జవాన్లు ఘన నివాళులర్పించారు. ఇవాళ పుల్వామా దాడికి ఏడాది పూర్తి అయిన సందర్భంగా శ్రీనగర్ లోని సీఆర్పీఎఫ్ క్యాంపస్ లో అమరజవాన్లకు ఘననివాళలర్పించే కార్యక్రమానికి ముఖ్య అతిధిగా మహారాష్ట్రకు చెందిన ఉమేశ్ గోపినాథ్ జాద‌వ్‌ హాజరయ్యారు.

పుల్వామాలో చ‌నివాయిన ప్ర‌తి సైనికుడి ఇంటికి వెళ్లేందుకు ఉమేశ్ గోపినాథ్ జాద‌వ్‌ దేశవ్యాప్తంగా 61 వేల కిలోమీట‌ర్లు తిరిగాడు. 40మంది అమరజవాన్ల కుటుంబ‌స‌భ్యుల‌ను క‌లిసి మాట్లాడాడు. వారి ఇంటి ముందున్న మ‌ట్టిని, ఆ సైనికుల‌ను ద‌హ‌నం చేసిన‌ ప్రాంతం నుంచి మ‌ట్టిని సేకరించాడు.

ఇవాళ పుల్వామా దాడికి ఏడాది పూర్తి అయిన నేప‌థ్యంలో క‌శ్మీర్‌లోని లెత్‌పోరా క్యాంపు వ‌ద్ద స్మారక స్థూపాన్ని ఆవిష్క‌రించారు. ఆ స్థూపం దగ్గర  సైనికుల ఇంటి నుంచి ఉమేశ్ గోపినాథ్ తెచ్చిన మ‌ట్టి క‌ల‌శాన్ని పెట్టారు.  అమ‌ర సైనికుల‌కు తాను ఇచ్చే ఘ‌న‌మైన నివాళి ఇదే అని ఉమేశ్ ఈ సంద‌ర్భంగా అన్నాడు.

Read Here>>మెరుపు వేగం : ఉసేన్ బోల్ట్ రికార్డ్ ను బద్దలుకొట్టిన భారతీయుడు