Jnu Computer Operator Holds Nine Guinness Records For Typing Skills
JNU computer operator: కంప్యూటర్ కీ బోర్డ్‌ను టకా టకా కరెక్ట్‌గా కొట్టడం అనేది కూడా ఒక ఆర్ట్.. అతి తక్కువ టైమ్‌లో కీ బోర్డ్‌లో టైపింగ్ చేసి రికార్డ్ క్రియేట్ చేశారు ఢిల్లీలోని జవహర్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయంలో కంప్యూటర్ ఆపరేటర్‌గా పనిచేసే వినోద్ కుమార్ చౌధరి. కఠోర సాధనతో టైపింగ్‌లో ఏకంగా తొమ్మిది గిన్నీస్ రికార్డులను క్రియేట్ చేశాడు వినోద్. ముక్కుతో, మౌత్ స్టిక్‌తో, కళ్లకు గంతలు కట్టుకొని, రకరకాల విన్యాసాలతో రికార్డులు మీద రికార్డ్‌లు క్రియేట్ చేశాడు.
2014 సంవత్సరంలో తొలిసారి గిన్నీస్ రికార్డ్ కైవసం చేసుకున్న వినోద్.. తొమ్మిది గిన్నీస్ రికార్డ్‌లను క్రియేట్ చెయ్యగా.. సచిన్ టెండుల్కర్ పేరు మీద ఉన్న 19 గిన్నిస్ రికార్డులను అధిగమించాలనే లక్ష్యాన్ని పెట్టుకున్నట్లు చెబుతున్నారు. ముక్కుతో 46.30 సెకన్లలో 103 క్యారెక్టర్లను టైప్ చేసి ఫస్ట్ గిన్నీస్ రికార్డ్ సాధించారు వినోద్. 2016లో మరో రెండు రికార్డులు.. కళ్లకు గంతలు కట్టుకొని 6.71 సెకన్లలో ఇంగ్లిష్ వర్ణమాలలోని అన్ని అక్షరాలను టైప్ చేసి మరో రికార్డ్ క్రియేట్ చేశారు. 6.09 సెకన్లలో వేగంగా టైప్ చేయడం ద్వారా మరో రికార్డు సృష్టించారు.
2017లో నోట్లో కర్ర పెట్టుకొని ఇంగ్లిష్ వర్ణమాలలోని అన్ని అక్షరాలను 18.65 సెకన్లలో టైప్ చేసి, మరో ‘గిన్నిస్’ రికార్డ్ క్రియేట్ చేశారు. ఇదే విన్యాసాన్ని 17.69 సెకన్లలో పూర్తి చేయడం ద్వారా 2018లో తన రికార్డును తానే బద్దలు కొట్టాడు. 2019లో 17.01 సెకన్లతో అదే రికార్డునూ తిరగరాశాడు వినోద్. ఒకే వేలుతో 29.53 సెకన్లలో అన్ని అక్షరాలను టైప్ చేసి గిన్నిస్‌లో మరోసారి చోటు దక్కించుకున్నారు. ఇవి కాకుండా గతేడాది టెన్నిస్ బంతిని నిమిషంలో 205 సార్లు తాకడం ద్వారా మరో రికార్డు సృష్టించారు.