JNU students and staff clash over stalled scholarships
JNU: ప్రఖ్యాత జవహార్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయంలో స్కాలర్షిప్పుల విషయమై విద్యార్థులకు స్టాఫ్కు మధ్య సోమవారం ఘర్షణ చోటు చేసుకుంది. జేఎన్యూ అడ్మినిస్ట్రేషన్ వద్దకు నిరసనగా వచ్చిన విద్యార్థులను యూనివర్సిటీ స్టాఫ్ అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం ఏర్పడినట్లు యూనివర్సిటీ వర్గాలు తెలిపాయి. ఇరు వర్గాలు ఒకరినొకరు తోసుకోవడంతో ప్రారంభించి కొట్టుకునే వరకు వెళ్లింది. ఇందులో పలువురు గాయపడ్డట్లు సమాచారం.
రెండేళ్లుగా విద్యార్థుల స్కాలర్షిప్పులు విడుదల చేయడం లేదని అఖిల భారతీయ విద్యార్థి పరిషద్ నిరసనకు పిలుపునిచ్చింది. ఈ సందర్భంగా ఏబీవీపీ విద్యార్థులు సోమవారం జేఎన్యూ అడ్మినిస్ట్రేషన్ ముట్టడికి యత్నించారు. ఈ క్రమంలో వారిని స్టాఫ్ అడ్డుకున్నారు. చూస్తుండగానే ఇరు వర్గాల మధ్య ఘర్షణ ఏర్పడింది. కాగా, ఈ ఘర్షణలో ఏబీవీపి జేఎన్యూ అధ్యక్షుడు రోహిత్ కుమార్ సహా అదే సంఘానికి చెందిన పలువురు విద్యార్థులు గాయపడ్డట్లు ఆ సంఘం నేతలు చెప్పారు. అయితే ఇరు వర్గాల వారు గాయపడ్డట్లు ఢిల్లీ పోలీసులు తెలిపారు.
Bihar: టీచర్ అభ్యర్థులపై పోలీసు అధికారుల అమానుష దాడి.. ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు