JNUలో దాడిలో ముసుగు మనుషులు: ABVP బలం తెలియడానికే చేశారట

JNUలో ముసుగులు ధరించిన వ్యక్తులు స్టూడెంట్లపై దాడికి పాల్పడ్డారు. ఆ తర్వాత యూనివర్సిటీ సర్వర్ రూంలో గందరగోళం అంతా నాశనం అయింది. ఈ ఘటనకు కారణమైన ముసుగు ధరించిన వ్యక్తులు ఎవరనే దానిపై ఇండియా టుడే ప్రత్యేకంగా ఇన్వెస్టిగేషన్ నిర్వహించింది. దాడిలో ప్రధానంగా వ్యవహరించిన ఇద్దరు వారు ఎవరితో మాట్లాడుతున్నారో తెలియక నిజాలన్నీ బయటపెట్టేశారు. 

JNUలో ఫ్రెంచ్ డిగ్రీ చదువుతున్న అక్షత్ అవస్తీ ఆదివారం జరిగిన ఘటన వీడియోలో ఉన్నది తానేనని తాను అఖిల భారతీయ విద్యార్థి పరిషత్‌కు చెందిన విద్యార్థినని చెప్పుకున్నాడు. కావేరీ హాస్టల్ లో ఉంటున్న అక్షత్.. కర్రతో మొహానికి హెల్మెట్ పెట్టుకుని హాస్టల్ కారిడార్స్ లో తిరుగుతూ కనిపించాడు. 

నిందితుల్లో ఒకరైన అక్షత్ అవస్తీ..
ప్రశ్న: మీ చేతిలో ఏముంది.. ఎక్కడనుంచి తెచ్చారు. 
అవస్తీ: ర్ర సార్.. పెరియార్ హాస్టల్ దగ్గర ఓ జెండా కర్రను పట్టుకొచ్చేశా.

ఎవరినైనా కొట్టావా..
అక్కడొక మనిషి ఉన్నాడు గడ్డం పెంచుకుని.. కశ్మీరీలా అనిపించాడు. గట్టిగా కొట్టాను. ఆ తర్వాత గేట్ పగులకొట్టా. నేను కానూర్ నుంచి వచ్చా. అక్కడ గల్లీగల్లీలో గూండాలు ఉంటారు. వారినే చూస్తూ ఉండేవాడ్ని. 

గంటల కొద్దీ జరిగిన దాడిని ఒక్కడే ఎలా హ్యాండిల్ చేయగలిగావని వేసిన ప్రశ్నకు.. ‘ఇది ప్రతీకార చర్య మాత్రమే. నా ప్రెండ్ ఏబీవీపీలో ఆర్గనైజేషనల్ సెక్రటరీగా ఉంటున్నాడు. శబర్మతీలో దాడి జరుగుతున్నప్పుడు లెఫ్ట్ వింగ్ స్టూడెంట్స్.. టీచర్స్ అంతా ఒక చోటే ఉన్నారు. వాళ్లంతా పరుగెత్తి లోపల దాక్కున్నారు. వాహనాలు ఫర్నీచర్..అన్నీ ధ్వంసం అయ్యాయి. వారు ఏబీవీపీ నుంచి ఇలాంటి ప్రతీకార దాడి జరుగుతుందని ఊహించలేదు. 

జేఎన్‌యూకు సంబంధించిన ఏబీవీపీ వ్యక్తులు 20మంది.. బయట నుంచి 20మందిని తీసుకొచ్చారనేది వాస్తవమేనా..

ఇది చేసిందంతా నేనే.. వాళ్లకంత బుర్ర లేదు. మనం ఓ కమాండర్‌లా ఏం చెప్తే అది చేసేస్తారు. ఎక్కడ దాక్కోవాలి.. ఏం చేయాలి.. అన్నీ ప్లాన్ చేసి చెప్పా. నాకొక అధికారం లేదు హోదా లేదు అయినా నా మాటలు జాగ్రత్తగా విన్నారు. వారిని కేవలం దాడి చేయడమని చెప్పలేదు.. వారి కోపాన్ని సరైన విధానంలో వాడుకున్నా.

పెరియార్ హాస్టల్లో జరిగిన దాడి తర్వాత అక్కడ ఉన్న ఓ పోలీసుపై ఇక్కడ వ్యక్తి గాయపడ్డాడని చెప్పా. ఆయన వారిని మీరు కూడా గట్టిగా కొట్టాలి అని చెప్పాడని అవస్తీ చెప్పాడు. 

అలా పోలీసులు ఎందుకు చేస్తారు. అంటే ఏబీవీపీ సాయం చేశారా..
క్యాంపస్ లో అల్లర్లు జరగకూడదని చేశారు. పోలీసులంటే ఎవరి వాళ్లు?

లెఫ్ట్ వింగ్ స్టూడెంట్స్ మాస్క్ లతో వచ్చారు. మేం దాన్ని కాపీ కొట్టామంతే. 

అవస్తీకి హెల్మెట్ ఇచ్చిన రోహిత్ షా అనే వ్యక్తి మాట్లాడుతూ.. 
అవస్తీకి హెల్మెట్ నేనే ఇచ్చా. ఎందుకంటే అద్దం పగులకొట్టడానికి వెళ్లేటప్పుడు అది తప్పనిసరి. దాడి జరుగుతున్నప్పుడు ఏబీవీపీ రూంపై దాడి చేయకుండా వదిలేశాం. ఆదివారం జేఎన్‌యూలో జరిగిన దానికి గర్వంగా ఫీలవుతున్నాం. ఇలా జరిగి ఉండకపోతే లెఫ్ట్ వింగ్‌కు ఏబీవీపీ బలమేంటో తెలిసేది కాదు. 

ఈ దాడిలో ఉన్న మిగిలిన స్టూడెంట్లను వీడియోలో అవస్తీ గుర్తుపట్టాడు. వారి వివరాలను పోలీసులు అడిగితే తామిచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని ఇండియా టుడే చెప్పింది. 

ముందుగా పెరియార్ హాస్టల్ పై దాడి ఎందుకు జరిగిందంటే:

జేఎన్‌యూ స్టూడెంట్ లీడర్ ఆయిషీ ఘోష్‌తో పాటు చుంన్‌చున్ కుమార్‌, పంక‌జ్ మిశ్రా, అయిషా ఘోష్‌, వాస్క‌ర్ విజ‌య్‌, సుచెతా త‌లుక్‌రాజ్‌, ప్రియా రంజ‌న్‌, డోల‌న్ సావంత్‌, యోగేంద్ర భ‌ర‌ద్వాజ్‌, వికాస్ ప‌టేల్ ఉన్నారు. వీరంతా ఈనెల 5న యూవర్సిటీలోని పెరియర్‌ హాస్టల్‌పై దాడికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. 

జ‌న‌వ‌రి 1 నుంచి 5వ తేదీ వ‌ర‌కు విద్యార్థుల ఆన్‌లైన్ రిజిష్ట్రేష‌న్ కోసం జేఎన్‌యూ అడ్మినిస్ట్రేష‌న్ నిర్ణ‌యించింద‌ని, వ‌ర్సిటీలోని జేఎన్‌యూ స్టూడెంట్స్ యూనియ‌న్‌, స్టూడెంట్స్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా, ఆల్ ఇండియా స్టూడెంట్స్ ఫెడ‌రేష‌న్‌, ఆల్ ఇండియా స్టూడెంట్స్ అసొసియేష‌న్‌, డెమోక్ర‌టిక్ స్టూడెంట్స్ ఫెడ‌రేష‌న్‌.. విద్యార్థుల‌ ఆన్‌లైన్ రిజిస్ట్రేష‌న్‌ను వ్య‌తిరేకించాయ‌న్నారు. ఈ క్రమంలో అయిషీ ఘోష్ ఇతర వామపక్ష సభ్యులు ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్లను ఆపడానికి.. పెరిగిన ఫీజులకు వ్యతిరేకంగా నిరసనపై సమ్మెను అమలు చేయడానికి జెఎన్‌యులోని సర్వర్ గదిపై దాడి చేశారన్నారు.