Jobs : చిత్తూరు వైద్య,ఆరోగ్య శాఖలో ఉద్యోగాల భర్తీ

దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల వయస్సు 2021 జూలై 1 నాటికి 18 నుంచి 42 సంవత్సరాల మధ్య ఉండాలి.

Pharmacist (2)

Jobs : ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి చెందిన చిత్తూరు జిల్లా వైద్య, ఆరోగ్యశాఖాధికారి కార్యాలయం ఒప్పంద ప్రాతిపదికన 26 పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఫార్మసిస్ట్‌ గ్రేడ్‌-2 పోస్టులను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. దీనికి సబంధించిన విద్యార్హతల విషయానికి వస్తే ఇంటర్మీడియెట్‌తోపాటు రెండేళ్ల డిప్లొమా ఫార్మసీ కోర్సు, బ్యాచిలర్‌ ఫార్మసీ ఉత్తీర్ణత. ఏపీ ఫార్మసీ కౌన్సిల్‌లో రిజిస్టరై ఉండాలి.

దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల వయస్సు 2021 జూలై 1 నాటికి 18 నుంచి 42 సంవత్సరాల మధ్య ఉండాలి. ఎంపికైన వారికి నెలకు రూ.19,019 చెల్లిస్తారు. అర్హత పరీక్షలో సాధించిన మెరిట్‌ మార్కులు, కోర్సు వెయిటేజ్‌, సర్వీస్‌ వెయిటేజ్‌, రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్‌ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.

దరఖాస్తులను అభ్యర్ధులు ఆఫ్‌లైన్‌ విధానం ద్వారా పంపాల్సి ఉంటుంది. దరఖాస్తుకు చివరితేదీ డిసెంబరు 21గా నిర్ణయించారు. దరఖాస్తులు పంపాల్సిన చిరునామా: డీఎంహెచ్‌ఓ, చిత్తూరు, ఆంధ్రప్రదేశ్‌ పూర్తి వివరాలకు వెబ్ సైట్ https://chittoor.ap.gov.in/