Icsil Jobs : ఐసిఎస్ఐఎల్ లో ఉద్యోగాల భర్తీ

భర్తీ చేయనున్న పోస్టుల్లో క్లర్క్ కమ్ కంప్యూటర్ ఆపరేటర్, డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టులు ఉన్నాయి. దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల వయస్సు జనవరి 1, 2022 నాటికి 21 సంవత్సరాలకు మించరాదు.

Icsil (1)

Icsil Jobs : భారత ప్రభుత్వం, ఢిల్లీ స్టేట్ గవర్నమెంట్ సంయుక్త అధ్వర్యంలోని ఇంటెలిజెంట్ కమ్యునికేషన్ సిస్టమ్స్ ఇండియా లిమిటెడ్ లో ఒప్పంద ప్రాతిపదికన పోస్టుల భర్తీ చేపట్టనున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 24 ఖాళీలను భర్తీ చేయనున్నారు. అర్హులైన అభ్యర్ధుల నుండి ఆయా పోస్టులకు దరఖాస్తులు కోరుతున్నారు.

భర్తీ చేయనున్న పోస్టుల్లో క్లర్క్ కమ్ కంప్యూటర్ ఆపరేటర్, డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టులు ఉన్నాయి. దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల వయస్సు జనవరి 1, 2022 నాటికి 21 సంవత్సరాలకు మించరాదు. విద్యార్హతల విషయానికి వస్తే ఏదైనా డిగ్రీ ఉత్తర్ణత సాధించటంతోపాటు ఏడాది పాటు పని అనుభవాన్ని కలిగి ఉండాలి.

స్ట్రీనింగ్ పరీక్ష, టైపింగ్, అధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు. అభ్యర్ధులు తమ దరఖాస్తులను ఆన్ లైన్ ద్వారా పంపాల్సి ఉంటుంది. దరఖాస్తు రుసుముగా 1000రూపాయలు చెల్లించాలి. దరఖాస్తు చివరి తేది ఫిబ్రవరి 22, 2022గా నిర్ణయించారు. పూర్తి వివరాలకోసం http://icsil.in/ సంప్రదించాలి.