యమ్మీ..యమ్మీ, నాన్ రోటీ మాస్క్..కరోనా కోఫ్తా కర్రీ

  • Publish Date - August 2, 2020 / 10:55 AM IST

కరోనా కర్రీ ఏందిరా బాబు..అనుకుంటున్నారా ? దిక్కుమాలిన ఈ వైరస్ బారిన పడి ఎంతో మంది చనిపోతుంటే..కర్రీ అని తిట్టుకోకండి. ప్రపంచంలో ఏదైనా జరిగిందంటే..దానిని క్యాష్ చేసుకోవాలని అనుకుంటుంటారు కొంతమంది వ్యాపారులు. ప్రస్తుతం కరోనా వైరస్ పోలినట్లుగా ఆహార పదార్థాలను తయారు చేసి రండి..బాబు రండి..టేస్ట్ చేయండి అంటున్నారు



కొంతమంది. ఇటీవలే ఓ Bakery లో వైరస్ పోలినట్లుగా ఉన్న ఫుడ్స్ ఐటమ్స్ తయారు చేసి కస్టమర్లను ఆకర్షించే ప్రయత్నం చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ జాబితాలో ఓ రెస్టారెంట్ చేరింది.

రాజస్థాన్ జోధ్ పూర్ లో ఓ రెస్టారెంట్ Carona Curry లను తయారు చేస్తోంది. వైరస్ ఆకారంలో కనిపించేలా కూరలున్నాయి. ఈ స్పెషల్ గాతయారు చేసిన కర్రీలను తినడానికి ప్రజలు ఎగబడుతున్నారని అంటోంది ఆ రెస్టారెంట్. మలాయ్ కోఫ్తా (malai kofta curry) కర్రీలను ఈ విధంగా తయారు చేస్తున్నారు.

కోఫ్తాలను వైరస్ ఆకారంలో చేస్తున్నారు. ఇక వైరస్ కట్టడి చేసేందుకు తప్పనిసరిగా మాస్క్ లను ధరించాలనే సంగతి తెలిసిందే. నాన్ రోటీలను (butter naan) Mask లను తయారు చేశారు. కోఫ్తా కర్రీలో రోటీలలను నంచుకుని తింటే..ఆ టేస్టే వేరే గురూ..అంటున్నారు.



ఇక తమ రెస్టారెంట్ లో కరోనా వైరస్ కట్టడి చేసేందుకు చర్యలు తీసుకున్నామన, ఎప్పటికప్పుడు శానిటేషన్ చేస్తున్నామన్నారు. సోషల్ డిస్టెన్సింగ్ తప్పనిసరిగా అమలయ్యేలా చూస్తున్నామంటోంది రెస్టారెంట్. ప్రస్తుతం malai kofta curry, butter naan మాస్క్ లకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ట్రెండింగ్ వార్తలు