India Covid 19
Johnson & Johnson: వచ్చే నెలలో జాన్సన్ అండ్ జాన్సన్ టీకా అందుబాటులోకి రాబోతోంది. అసోసియేషన్ ఆఫ్..హెల్త్ కేర్ ప్రొవైడర్స్ కొద్ది మొత్తంలో దిగుమతి చేసుకోనుంది. జాన్సన్ అండ్ జాన్సన్ రూపొందించింది సింగిల్ డోస్ అనే సంగతి తెలిసిందే. ఫ్రోజెనస్ స్టోరేజ్ అవసరం లేని టీకా కావడం విశేషం. భారత వాతావరణ పరిస్థితులకు అనుకూలమని వైద్యులు అంటున్నారు. ఈ టీకాను ప్రజలకు అత్యవసర వినియోగానికి ఇచ్చేందుకు త్వరలోనే అనుమతి లభించే అవకాశం ఉందని తెలుస్తోంది.
ఫిబ్రవరిలో టీకాకు అమెరికా ప్రభుత్వం అనుమతినిచ్చింది. గత నెలలో బ్రిటన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. డెల్టా వేరియంట్ పై టీకా ప్రభావంతంగా పనిచేస్తోందని జాన్సన్ అండ్ జాన్సన్ తెలిపింది. సింగిల్ షాట్ అయిన దీని ధర భారతదేశంలో 25 డాలర్లుగా ఉండే అవకాశం ఉందని సమాచారం. జాన్సన్ అండ్ జాన్సన్ చేసిన కరోనా వ్యాక్సిన్ అమెరికా, యూరప్ దేశాల్లో అందుబాటులోకి వచ్చింది. సింగిల్ డోస్ వ్యాక్సిన్ 66 శాతం సమర్థవంతంగా పనిచేస్తున్నట్లు, తీవ్ర కేసుల్లో మాత్రం 85 శాతం సమర్థత చూపించినట్లు ఆ సంస్థ వెల్లడించింది.
వ్యాక్సిన్ ప్రయోగాలను ప్రపంచ వ్యాప్తంగా 44 వేల మందిపై జరిపినట్లు, అమెరికాలో జరిపిన ప్రయోగాల్లో 72 శాతం, లాటిన్ అమెరికా దేశాల్లో 66 శాతం, సౌతాఫ్రికాలో 57 శాతం సమర్థత కనిబరిచిందని జే అండ్ జే ప్రకటించింది. భారత్ లో విదేశీ టీకా అనుమతి పొందాలంటే..తప్పనిసరిగా క్లినికల్ ట్రయల్స్ నిర్వహించాల్సి ఉంటుంది.