Single Dose Vaccine : జాన్సన్ అండ్ జాన్సన్ వ్యాక్సిన్ కు కేంద్రం గ్రీన్ సిగ్నల్

జాన్సన్ అండ్ జాన్సన్ తయారు చేసిన వ్యాక్సిన్ కు భారత ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అత్యవసర వినియోగానికి అనుమతినిచ్చింది. దేశంలో తొలి సింగిల్ డోస్ వ్యాక్సిన్ గా జాన్సన్ అండ్ జాన్సన్ కంపెనీ నిలిచింది.

Janson Janson Covid Vaccine

Johnson & Johnson’s : కరోనా వైరస్ ను అరికట్టేందుకు జాన్సన్ అండ్ జాన్సన్ తయారు చేసిన వ్యాక్సిన్ కు భారత ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అత్యవసర వినియోగానికి అనుమతినిచ్చింది. దేశంలో తొలి సింగిల్ డోస్ వ్యాక్సిన్ గా జాన్సన్ అండ్ జాన్సన్ కంపెనీ నిలిచింది.

Read More : Bombay High Court : రాజ్‌కుంద్రా బెయిల్ పిటిషన్ ను తిరస్కరించిన బాంబే హైకోర్టు

దేశంలో కరోనా కట్టడికి కేంద్ర ప్రభుత్వం వ్యాక్సినేషన్ ప్రక్రియను జోరుగా కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం దేశంలో కోవిషీల్డ్, కోవాక్సిన్, స్పూత్నిక్ వ్యాక్సిన్లను పంపిణీ చేస్తున్న సంగతి తెలిసిందే. కరోనా వైరస్ కట్టడికి సింగిల్ డోసు వ్యాక్సిన్ ను అమెరికా సంస్థ జాన్సన్ అండ్ జాన్సన్ అభివృద్ధి చేసింది. అత్యవసర వినియోగానికి అనుమతినివ్వాలంటూ…కేంద్ర ప్రభుత్వాన్ని అభ్యర్థించింది.

Read More : India Vaccines : భారత్‌లోకి మరో రెండు టీకాలు

ఈ మేరకు డ్రగ్ కంట్రోలర్ అండ్ జనరల్ ఆఫ్ ఇండియాకు శుక్రవారం దరఖాస్తు చేసుకుంది. గతంలో సంస్థ భారత్ లో ట్రయల్స్ నిర్వహించేందుకు దరఖాస్తు చేసుకుని..దానిని ఉపసంహరించుకున్న సంగతి తెలిసిందే. పలు దేశాల్లో ఈ వ్యాక్సిన్ ను ఉపయోగిస్తున్నారు. దీనిని అనుమతించిన వ్యాక్సిన్లను ట్రయల్స్ నిర్వహణ లేకుండానే..అత్యవసర వినియోగానికి అనుమతించాలని కేంద్ర ప్రభుత్వం భావించింది. తాజాగా…2021, ఆగస్టు 07వ తేదీ శనివారం కేంద్ర ఆరోగ్య మంత్రి Mansukh Mandaviya ట్విట్టర్ వేదికగా స్పందించారు. భారతదేశంలో టీకా విస్తరణ మరింత విస్తరించిందని వెల్లడించారు.

డెల్టా వేరియంట్‌కు కరెక్ట్ ఆన్సర్ జాన్సన్ అండ్ జాన్సన్ వ్యాక్సిన్ అని ఆ సంస్థ చెబుతోంది. సింగిల్‌ డోస్‌తోనే డెల్టా వేరియంట్‌ను పూర్తి స్థాయిలో నిర్వీర్యం చేస్తుందని పరిశోధనల్లో తేలింది. ఈ వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుందని.. టీకా ప్రభావం ఎనిమిది నెలల వరకు ఉంటుందని సంస్థ ప్రతినిధులు చెబుతున్నారు.  తీవ్ర కేసుల్లో తమ వ్యాక్సిన్‌ 85 శాతం ప్రభావశీలతను చూపిస్తోందని, ఆస్పత్రిలో చేరిన వారిలో 93.1 శాతం ప్రభావం చూపిస్తోందని వెల్లడించారు.