Bombay High Court : రాజ్‌కుంద్రా బెయిల్ పిటిషన్ ను తిరస్కరించిన బాంబే హైకోర్టు
అశ్లీల చిత్రాల కేసులో అరెస్టయిన రాజ్‌కుంద్రాకు బాంబే హైకోర్టులోనూ నిరాశ ఎదురయింది. తన అరెస్టు నిబంధనలకు విరుద్ధమని ఆరోపిస్తూ రాజ్‌కుంద్రా దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌ను బాంబే హైకోర్టు తిరస్కరించింది.

Rajkundras bail petition
Rajkundras bail petition : అశ్లీల చిత్రాల కేసులో అరెస్టయిన రాజ్‌కుంద్రాకు బాంబే హైకోర్టులోనూ నిరాశ ఎదురయింది. తన అరెస్టు నిబంధనలకు విరుద్ధమని ఆరోపిస్తూ రాజ్‌కుంద్రా దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌ను బాంబే హైకోర్టు తిరస్కరించింది. తనకు బెయిల్ ఇవ్వాలని కోరుతూ రాజ్‌కుంద్రా మొదట ముంబై కోర్టులో పిటిషన్ వేశాడు.
ఆ పిటిషన్‌ను ముంబై కోర్టు తిరస్కరించడంతో ఆయన బాంబే హైకోర్టును ఆశ్రయించాడు. తన అరెస్టులో పోలీసులు నిబంధనలు పాటించలేదని, తనకు బెయిల్ ఇవ్వాలని పిటిషన్‌లో కోరాడు. రాజ్ కుంద్రా విజ్ఞప్తిని బాంబే హైకోర్టు తిరస్కరించడంతో అతను మరికొంత కాలం జైల్లోనే ఉండాల్సి ఉంది.
అటు మహారాష్ట్ర పోర్నోగ్రఫీ సైబర్ కేసులో రాజ్‌కుంద్రా దాఖలు చేసిన యాంటిసిపేటరీ బెయిల్ పిటిషన్‌పై సెషన్స్ కోర్టులో ఇవాళ విచారణ జరగడం లేదు. జడ్జి అందుబాటులో లేకపోవడంతో…ఈ పిటిషన్ విచారణ వాయిదా పడింది.