PoK: పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లో ఉద్రిక్తత.. పోలీసుల కాల్పుల్లో 30 మందికి పైగా మృతి
పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్‌లో (PoK) తీవ్ర ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి.
- V Santhosh Kumar
- Published on- June 9, 2026 / 04:41 PM IST
Joint awami action committee protest pok clash 30 dead assembly elections
- పీఓకేలో చెలరేగిన తీవ్ర హింసాత్మక అల్లర్లు
- పోలీసుల కాల్పుల్లో ముప్పై మంది మృతి
- ఆర్థిక రాజకీయ సమస్యలపై ప్రజల నిరసనలు
PoK: పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్‌లో (PoK) తీవ్ర ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. ఆర్థిక, రాజకీయ సమస్యలపై నిరసనలు తెలుపుతున్న జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ (JAAC) అనే సంస్థను అక్కడి ప్రభుత్వం ఉగ్రవాద సంస్థగా ప్రకటిస్తూ నిషేధించడంతో అల్లర్లు చెలరేగాయి. ఆదివారం రావల్‌కోట్‌లో ప్రదర్శనకారులకు, పోలీసులకు మధ్య జరిగిన ఘర్షణలు హింసాత్మకంగా మారడంతో 30 మందికి పైగా మరణించగా, సుమారు 200 మందికి పైగా గాయపడినట్లు తెలుస్తోంది.
Telangana Rains: తెలంగాణకు భారీ వర్ష సూచన.. రాబోయే రెండు రోజులు అలర్ట్
పోలీసుల కాల్పుల్లో ఓ స్థానిక వ్యాపారి మరణించడంతో ఈ నిరసనలు మరింత ఉధృతమయ్యాయి. రావల్‌కోట్ మార్చురీ వెలుపల గుమిగూడిన నిరసనకారులను చెదరగొట్టే క్రమంలో ఆటోమేటిక్ రైఫిళ్లు, పెట్రోల్ బాంబులతో దాడులు జరిగాయని, ఆత్మరక్షణ కోసమే పోలీసులు ఎదురుకాల్పులు జరపాల్సి వచ్చిందని అధికారులు చెప్తున్నారు. అయితే ప్రభుత్వ అధికారిక లెక్కల కంటే క్షేత్రస్థాయిలో మృతుల సంఖ్య చాలా ఎక్కువగా ఉందని జేఏఏసీ మద్దతుదారులు ఆరోపిస్తున్నారు.
ఈ ఉద్రిక్తతలకు ప్రధాన కారణం జులై 27న జరగబోయే ప్రాంతీయ శాసనసభ ఎన్నికల్లో 12 స్థానాలను శరణార్థులకు కేటాయించడమే. దీనితో పాటు నిరంతర ఇంటర్నెట్ నిలిపివేతలు, విద్యుత్ కొరత, తీవ్ర ద్రవ్యోల్బణం, నిరుద్యోగం మరియు సహజ వనరుల దోపిడీకి వ్యతిరేకంగా ప్రజలు రోడ్లపైకి వచ్చారు. శాంతిభద్రతలను అదుపులోకి తెచ్చేందుకు ప్రభుత్వం అనేక మందిని అదుపులోకి తీసుకుంది.
