కర్నాటక సెంట్రల్ జైలులో ఓ జర్నలిస్టు ఆత్మహత్య చేసుకున్నాడు.
కర్నాటక సెంట్రల్ జైలులో ఓ జర్నలిస్టు ఆత్మహత్య చేసుకున్నాడు. జర్నలిస్టు అనిరాజ్ వాయిస్ ఆఫ్ యలహంక దినపత్రిక ఎడిటర్ గా పని చేస్తున్నాడు. అత్యాచారం ఆరోపణల కింద పోలీసులు అనిరాజ్ ను అరెస్టు జైలుకు తరలించారు. కాగా ఈ కేసు విచారణ జరుగుతుండగా జర్నలిస్టు జైలులో ఆత్మహత్య చేసుకున్నాడు.
తనకు కేటాయించిన గదిలో అనిరాజ్ ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసు అధికారులు తెలిపారు. అయితే అనిరాజ్ ఆత్మహత్య చేసుకోలేదని, పోలీసులే అతన్ని హత్య చేశారని మృతుడి కుటుంబీకులు, బంధువులు ఆరోపిస్తున్నారు. అనిరాజ్ మృతిపై విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తున్నారు.