Jp Nadda
JP Nadda: బీజేపీ జాతీయ అధ్యక్షుడు, ఎంపీ జేపీ నడ్డా ట్విట్టర్ ఖాతా ఆదివారం(27 ఫిబ్రవరి 2022) హ్యాక్ అయ్యింది. ఆదివారం ఉదయం నడ్డా ఖాతాను హ్యాక్ చేసి హ్యాకర్లు ట్వీట్ చేశారు. ఈ ట్వీట్‌లో, “రష్యా ప్రజలకు సాయం చెయ్యండి.. క్రిప్టోకరెన్సీ ద్వారా విరాళాలను స్వీకరిస్తున్నారు. ‘బిట్‌కాయిన్-ఎథెరియం’ అంటూ ఆగంతకులు ట్వీట్ చేశారు.
అంతేకాదు.. “యుక్రెయిన్ ప్రజలకు అండగా నిలవండి. క్రిప్టోకరెన్సీలో విరాళాలను అంగీకరిస్తున్నారు.” అంటూ హిందీలో కూడా ట్వీట్ చేశారు. హ్యాకర్లు ప్రొఫైల్ పేరును కూడా ICG OWNS INDIAగా మార్చారు.
అయితే, ఇప్పుడు ఆ ట్వీట్‌ను డిలేట్ చేశారు. హ్యాకింగ్‌కి సంబంధించిన సమాచారం అందిందని, CERT(కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్) హ్యాకింగ్ వెనుక కారణాలను పరిశీలిస్తోందని.. ఐటీ మంత్రిత్వశాఖ అధికారి రాజీవ్ చంద్రశేఖర్ వెల్లడించారు.
BJP national president JP Nadda’s Twitter account hacked. pic.twitter.com/AdZ3fh7pd3
— ANI (@ANI) February 27, 2022