Soumya Vishwanathan: 15 ఏళ్ల ఎదురుచూపులకు తెరదించుతూ.. జర్నలిస్ట్ సౌమ్య హత్య కేసులో కీలక తీర్పు ఇచ్చిన కోర్టు

తాజా తీర్పు సమయంలో మృతురాలు సౌమ్య విశ్వనాథన్ తండ్రి ఎంకే విశ్వనాథన్, తల్లి మాధవి విశ్వనాథన్ కోర్టు ముందు హాజరయ్యారు. ఇక, నిందితుడు అమిత్ శుక్లా వేసిన మధ్యంతర బెయిల్ పిటిషన్‌ను కూడా కోర్టు తిరస్కరించింది.

Soumya Vishwanathan Case: 2008లో టీవీ జర్నలిస్టు సౌమ్య విశ్వనాథన్ హత్య కేసులో నిందితులందరినీ ఢిల్లీలోని సాకేత్ కోర్టు దోషులుగా నిర్ధారించింది. విచారణ అనంతరం సెషన్స్ జడ్జి రవీంద్ర కుమార్ పాండే ఈ తీర్పును బుధవారం వెలువరించారు. వసంత్ కుంజ్ పోలీస్ స్టేషన్‌లో 302/34 ఐపీసీ, 411 ఐపీసీ, 3(1)(ఐ), 3(2), 3(5), ఎంసీవోసీఏ (MCOCA) సెక్షన్ల కింద నమోదైన సౌమ్య విశ్వనాథన్ హత్య కేసులో సాకేత్ కోర్టు నలుగురు నిందితులపై వ్యవస్థీకృత నేరాల కింద కేసు నమోదు చేసింది. MCOCAలోని 411 IPC, 3(1)(i), 3(2), 3(5) సెక్షన్ల కింద అజయ్ సేథి దోషిగా నిర్ధారించబడ్డారు.

గత విచారణలో, అదనపు సెషన్స్ జడ్జి రవీంద్ర కుమార్ పాండే తీర్పు వెలువడే సమయంలో నిందితులందరూ భౌతికంగా కోర్టుకు హాజరు కావాలని ఆదేశించారు. సౌమ్య విశ్వనాథన్ సెప్టెంబర్ 30, 2008 ఉదయం 3.30 గంటలకు పని ముగించుకుని ఇంటికి తిరిగి వస్తుండగా కారులోనే ఆమెను ఢిల్లీలోని సాకెత్ విహార్ ప్రాంతంలో కాల్చి చంపారు. ఆమె హత్య వెనుక దోపిడీ ఉద్దేశ్యం అని అప్పట్లో పోలీసులు పేర్కొన్నారు. అయితే ఆమె హత్యకు ఐదుగురు వ్యక్తులు (రవి కపూర్, అమిత్ శుక్లా, బల్జీత్ మాలిక్, అజయ్ కుమార్, అజయ్ సేథీ) లను అరెస్టు చేశారు. మార్చి 2009 నుంచి వీరు కస్టడీలో ఉన్నారు.

ఇది కూడా చదవండి: దీపావళికి ముందు కేంద్ర ఉద్యోగులకు, రైతులకు గుడ్ న్యూస్ చెప్పి మోదీ ప్రభుత్వం

నిందితుడిపై పోలీసులు కఠినమైన మహారాష్ట్ర కంట్రోల్ ఆఫ్ ఆర్గనైజ్డ్ క్రైమ్ యాక్ట్ (MCOCA) ప్రయోగించారు. 2009లో ఐటీ ఎగ్జిక్యూటివ్ జిగిషా ఘోష్ హత్య కేసులో బల్జీత్, మరో ఇద్దరు (రవి కపూర్, అమిత్ శుక్లా) గతంలో దోషులుగా నిర్ధారించబడ్డారు. జిగీషా ఘోష్ హత్యకు ఉపయోగించిన ఆయుధాన్ని స్వాధీనం చేసుకోవడంతో విశ్వనాథన్ హత్య కేసు బట్టబయలైనట్లు పోలీసులు తెలిపారు. 2017లో జిగిషా ఘోష్ హత్య కేసులో ట్రయల్ కోర్టు కపూర్, అమిత్ శుక్లాలకు మరణశిక్ష, బల్జీత్ మాలిక్‌లకు జీవిత ఖైదు విధించింది.

అయితే మరుసటి సంవత్సరం, హైకోర్టు రవి కపూర్, అమిత్ శుక్లా మరణశిక్షలను యావజ్జీవ కారాగార శిక్షగా మార్చింది. జిగిషా హత్య కేసులో బల్జీత్ మాలిక్‌కు జీవిత ఖైదును సమర్థించింది. ఇక తాజా తీర్పు సమయంలో మృతురాలు సౌమ్య విశ్వనాథన్ తండ్రి ఎంకే విశ్వనాథన్, తల్లి మాధవి విశ్వనాథన్ కోర్టు ముందు హాజరయ్యారు. ఇక, నిందితుడు అమిత్ శుక్లా వేసిన మధ్యంతర బెయిల్ పిటిషన్‌ను కూడా కోర్టు తిరస్కరించింది.

ఇది కూడా చదవండి: గాజా ఆసుపత్రి దాడిపై ప్రధాని మోదీ విచారం.. దోషుల్ని విడిచిపెట్టొద్దంటూ హెచ్చరిక

ట్రెండింగ్ వార్తలు