Juvenile Crocodile : చేపల కోసం వల వేస్తే.. మొసలి పడింది..!

చేపల కోసం వల వేస్తే.. భారీ మొసలి పడింది.. నీళ్లలో భారీగా కనిపించడంతో పెద్దచేపే పడింది అనుకున్నారు మత్య్సకారులు.. కానీ, వలను నీళ్లలోనుంచి బయటకు లాగి చూస్తే.. మొసలి చిక్కింది.

Juvenile Crocodile : చేపల కోసం వల వేస్తే.. భారీ మొసలి పడింది.. నీళ్లలో భారీగా కనిపించడంతో పెద్దచేపే పడింది ఇక పండగే అనుకున్నారంతా మత్య్సకారులు.. కానీ, వలను నీళ్లలోనుంచి బయటకు లాగి చూస్తే.. అందులో పెద్ద చేప లేదు.. కానీ, భారీ మొసలి చిక్కింది. అంతే.. ఒక్కసారిగా కంగుతిన్నారు మత్స్యకారులు. ఈ ఘటన ఒడిసాలోని తీరప్రాంతమైన కేంద్రపార జిల్లాలో జరిగింది. ఆ ప్రాంతానికి చెందిన మత్య్సకారుడు లూనా నదిలో చేపల వేటకు వెళ్లారు. చేపల కోసం నదిలోకి వలను విసిరాడు.

అయితే ఒక్కసారిగా బిగుసుకుపోవడంతో పెద్ద చేప పడిందని భ్రమపడ్డారు. తీరా బయటకు లాగి చూస్తే అది పెద్ద మొసలి అని తెలిసి నిరాశతో వెనుతిరిగారు. వలలో మొసలి చిక్కిన విషయాన్ని వెంటనే అటవీశాఖ అధికారులకు తెలియజేశారు. అక్కడికి చేరుకున్న అటవీ శాఖ అధికారులు ఆ మొసలిని తీసుకెళ్లి సురక్షిత ప్రాంతంలో వదిలేశారు. అయితే ఈ మొసలి ఆ నదిలోకి ఎలా వచ్చింది అనేదానిపై కూడా అంచనా వేశారు. ఉప్పునీటి మొసలిగా గుర్తించారు.

అయితే ఈ మొసలి భిటర్క్ నిక నది నుంచి లూనా నదిలోకి ప్రవేశించి ఉండొచ్చునని అటవీ శాఖా అధికారులు భావిస్తున్నారు. ఉప్పునీటి మొసళ్ల సంఖ్య చాలా తగ్గిపోయిందని అన్నారు. 19975 సంవత్సరంలో ఉప్పునీటి మొసళ్ల సంఖ్య కేవలం 96 మాత్రమే ఉండేదని తెలిపారు. మొసళ్లను సంరక్షణ చర్యలు చేపట్టినప్పటి నుంచి మొసళ్ల సంఖ్య 1768కి పెరిగిందని అటవీ శాఖ అధికారులు వెల్లడించారు.

Read Also : Facebook Profile Trick : మీ FB ప్రొఫైల్ ఎవరు చూశారో ఇట్టే తెలుసుకోవచ్చు!..

ట్రెండింగ్ వార్తలు