రాజకీయ పొత్తులపై ‘కమల్’ క్లారిటీ

Makkal Needhi Maiam will form an alliance with the people 2021లో జరిగే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు కమలహాసన్ నేతృత్వంలోని మక్కల్ నీది మయ్యమ్(MNM)పార్టీ సిద్దమవుతోంది. రాష్ట్రంలోని ద్రవిడ దిగ్గజ పార్టీలకు తామే ప్రత్యామ్నాయమని కమల్ హాసన్ అంటున్నారు. అయితే, రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తులపై వినిపిస్తున్న పలు ఊహాగానాలకు కమల్ చెక్ పెట్టారు.



రాబోయే ఎన్నికల్లో ప్రజలతో తమ పొత్తు ఉంటుందని, ఏ పార్టీతో కాదని కమల్ తేల్చి చెప్పారు. ఏ రాజకీయ పార్టీతో MNM పొత్తు పెట్టుకోవట్లేదని సోమవారం చెన్నైలో జరిగిన మక్కల్ నీది మయ్యమ్ పార్టీ జిల్లా స్థాయి కార్యదర్శుల సమావేశంలో కమల్ సృష్టం చేశారు. ఈ సందర్భంగా ఎన్నికల్లో పార్టీ విధివిధానాలు, అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారు. విజయం కోసం ప్రతి ఒక్కరూ పనిచేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు.





https://10tv.in/farooq-abdullah-mehbooba-mufti-in-jk-parties-alliance-for-article/
కాగా, గతేడాది జరిగిన పార్లమెంట్ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ తో పొత్తుకి కమల్ సిద్ధపడ్డాడు. అయితే, డీఎంకే పార్టీతో పొత్తు లేకపోతేనే అంటూ కాంగ్రెస్ కు షరతు పెట్టాడు. అయితే, కమల్ ని లైట్ తీసుకున్న కాంగ్రెస్.. డీఎంకేతో పొత్తు పెట్టుకున్న విషయం తెలిసిందే. తమిళనాడులోని ఒక్క స్థానం మినహా మిగిలిన అన్ని పార్లమెంట్ స్థానాలను కాంగ్రెస్-డీఎంకే కూటమి దక్కించుకుంది.



ఇక,వచ్చే ఏడాది జరుగనున్న తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకేతోనే కలిసి ముందుకుసాగాలని కాంగ్రెస్ నిర్ణయించుకోగా….బీజేపీతో కలిసి పోటీ చేయాలని అధికార అన్నాడీఎంకే ఆలోచన చేస్తోంది. ఇక, రజనీకాంత్ విషయంలో ఇంకా ఓ క్లారిటీ రాలేదు. అసలు ఆయన పార్టీ ఎన్నికల్లో పోటీ చేస్తదా..లేదా అనేది కూడా సస్పెన్స్.

ట్రెండింగ్ వార్తలు