టార్చ్‌ బేరర్‌: కమల్ హాసన్ ఎన్నికల గుర్తు ఏంటంటే?

  • Publish Date - March 10, 2019 / 06:47 AM IST

వెండితెరపై తనదైన నటనతో విలక్షణ నటుడు ఇమేజ్ తెచ్చుకున్న హీరో కమల్ హాసన్ రాజకీయ ఆరంగ్రేటం చేసిన సంగతి తెలిసిందే. మక్కల్ నీది మయ్యం పేరుతో పార్టీని ఏర్పాటు చేసి వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేస్తానంటూ ప్రకటించిన కమల్.. పార్టీని బలోపేతం చేస్తున్నారు. ఈ క్రమంలో కమల్ హాసన్‌కు  టార్చ్ లైట్ గుర్తును కేంద్ర ఎన్నికల సంఘం కేటాయించింది. ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా తెలిపిన కమల్..  చీకట్లో దారి చూపించే టార్చ్ లైట్ గుర్తును కేంద్రం ఇచ్చిందని, కేంద్ర ఎన్నికల సంఘం మంచి గుర్తును కేటాయించినందుకు దన్యవాదాలు అని తెలిపారు. తమిళనాడులో, భారతీయ రాజకీయ చరిత్రలో మక్కల్‌ నీది మయ్యం టార్చ్‌ బేరర్‌గా మారబోతోంది అని ఆయన ట్విట్టర్‌లో రాశారు.