BJP:మక్కల్ నీధి మయ్యమ్ పార్టీ చీఫ్ Kamal hasan కు షాక్. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ముందు పార్టీ జనరల్ సెక్రటరీగా వ్యవహరిస్తున్న ఏ అరుణాచలం BJPలో చేరారు. కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ సమక్షంలో BJP కండువా కప్పుకున్నారు. ట్యూటికోరిన్ జిల్లాకు చెందిన అరుణాచలం రాష్ట్ర ఎన్నికల కోసం కమల్ ప్రచారం చేస్తున్న సమయంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.
చెన్నైలోని BJP హెడ్ క్వార్టర్స్ వేదికగా జరిగిన ప్రెస్ కాన్ఫిరెన్స్ లో బీజేపీ లీడర్ జవదేకర్ మాట్లాడారు. ‘తమిళనాడు ఎన్నికల్లో BJP అద్భుత విజయం సాధిస్తుందని కాన్ఫిడెంట్ గా ఉన్నా. చాలా పార్టీలు దేశవ్యాప్తంగా కుటుంబ పార్టీలుగా ఉన్నాయి. కానీ, మా పార్టీయే మాకు కుటుంబం. అదే మాకు వాళ్లకు మధ్య తేడా. కచ్చితంగా చెప్తున్నా రాష్ట్ర ఎన్నికల్లో అద్భుత విజయం సొంతం చేసుకుంటాం’ అని అన్నారు.
హైదరాబాద్ విషయానికొస్తే గత ఎన్నికల ముందు మాకు జీహెచ్ఎంసీ నాలుగు సీట్లు మాత్రమే ఉన్నాయి. ఇటీవల జరిగిన ఎన్నికల్లో 48వరకూ సాధించాం. మధ్యప్రదేశ్ లో జరిగిన ఉప ఎన్నికల్లోనూ విజయం సాధించాం. ఉత్తరప్రదేశ్, గుజరాత్ లోనూ అదే పరిస్థితి. జమ్మూ అండ్ కశ్మీర్ లో జరిగిన డిస్ట్రిక్ట్ డెవలప్‌మెంట్ కౌన్సిల్ ఎన్నికల్లోనూ BJP సింగిల్ లార్జెస్ట్ పార్టీగా నిలిచింది. తమిళనాడులోనూ మా బెస్ట్ ఏంటో చూపిస్తాం’ అని జవదేకర్ వెల్లడించారు.
ఆ తర్వాత పాటలీ మక్కల్ కచ్చి మీడియా వింగ్ ప్రెసిడెంట్ సోలన్ కుమార వందయార్ కూడా జవదేకర్ సమక్షంలో BJPలోకి చేరారు. ఈ కార్యక్రమంలో BJP రాష్ట్ర అధ్యక్షులు ఎల్ మురుగన్, ఇతర పార్టీ కార్యకర్తలు కలిసి మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి జయంతి సందర్భంగా గౌరవ వందనం సమర్పించారు.