ఎంపీకి వార్నింగ్ ఇచ్చాడని కంగనా అభిమాని అరెస్ట్

  • Publish Date - September 12, 2020 / 08:46 AM IST

ప్రముఖ బాలీవుడ్ నటి కంగనా రౌత్ మహారాష్ట్ర అధికార పార్టీ శివసేన ఎంపీ సంజయ్ రౌత్ బాలీవడ్ నటుడు సుశాంత్‌ సింగ్ మృతి విచారణ విషయంలో మాటల యుద్ధం జరుగుతోంది. సుశాంత్ విచారణ విషయంలో కంగనా రనౌత్ ముంబయి పోలీసులపై సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. కంగనాను అసభ్యపదజాలంతో ఎంపీ తిట్టటం పెను సంచలనానికి దారి తీసింది. దీంతో వార్ హీటెక్కిపోయింది. ముంబయి మినీ పీఓకేను తలపిస్తోందని ఆరోపణలు..పలు ఘాటు వ్యాఖ్యలు ..దీంతో కంగనా తిరిగి ముంబయికి రావొద్దనీ..మహారాష్ట్ర ప్రజలు ఆమెను క్షమించరంటూ సంజయ్ రౌత్ మండిపడ్డారు.


దీనికి కంగనా కూడా ఏమాత్రం తగ్గకుండా..సెప్టెంబర్ 9న తేదీన ముంబైకి వస్తానని..దమ్ముంటే ఆపండి చూద్దాం అంటూ ఎంపీ సంజయ్ రౌత్ కి సవాల్ విసిరింది. చెప్పినట్టే ఆరోజు ముంబైకి వచ్చింది. అదే రోజు ముంబైలోని బంద్రాలో ఉన్న ఆమె ఇంట్లో అక్రమ నిర్మాణాలను చేపట్టారని బీఎంసీ అధికారులు ఆరోపించటం..దీంతో ఆమె నివాసాన్ని అధికారులు కూల్చివేయటంతో ఈ వివాదం మరింత ముదిరింది.



https://10tv.in/sajid-khan-told-me-to-strip-in-front-of-him-alleges-model-paula-in-new-me-too-post/
ఆమె నివాసాన్ని కూల్చివేసిన అనంతరం దేశవ్యాప్తంగా ఉన్న ఆమె అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో కంగనా అభిమాని అని చెప్పుకుంటున్న పలాష్ బోస్‌ అనే వ్యక్తి ఎంపీ సంజయ్‌ రౌత్‌కు ఫోన్ చేసి బెదిరింపులకు దిగాడని…దీంతో అతన్ని ముంబయి పోలీసులు గురువారం (సెప్టెంబర్10,2020) రాత్రి సౌత్ కోల్ కతాలో అతన్ని అదుపులోకి తీసుకున్నారు. అతడిని కోర్టు ముందు హాజరుపరుచనున్నామని పోలీసులు తెలిపారు.


ఎంపీ సంజయ్ రౌత్‌ తోపాటు మరికొందరికి కూడా ఇటువంటి కాల్స్ వచ్చినట్లు తెలుస్తోంది. మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్‌ ఠాక్రే, హోంమంత్రి అనిల్ దేశ్‌ముఖ్‌కు కూడా దుండగుల నుంచి ఇలాంటి కాల్స్‌ వచ్చినట్లుగా సమాచారం.