Kanhaiya Kumar: హీరోయిన్ దీపికా పదుకుణే వేసుకునే బట్టలపైనే నీ దృష్టి.. అంతేగానీ..: కన్నయ్య కుమార్

కంస మామను కన్నయ్య (శ్రీ కృష్ణ భగవానుడు) లోకంలో లేకుండా చేశాడని ఆయన అన్నారు.

Kanhaiya Kumar

Kanhaiya Kumar – Narottam Mishra: మధ్యప్రదేశ్ హోం శాఖ మంత్రి నరోత్తం మిశ్రా హీరోయిన్ దీపికా పదుకుణే దుస్తుల(Deepika Padukone)పై దృష్టి పెట్టకుండా ఆ రాష్ట్రంలో మహిళలు, గిరిజనులు, దళితులపై జరుగుతున్న దాడులపై దృష్టి పెడితే బాగుంటుందని కాంగ్రెస్ నేత(Congress), ఢిల్లీ జేఎన్‌యూ విద్యార్థి సంఘం మాజీ అధ్యక్షుడు కన్నయ్య కుమార్‌ అన్నారు.

నరోత్తం మిశ్రా గత ఏడాది డిసెంబరులో పఠాన్ సినిమా గురించి స్పందిస్తూ సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. పఠాన్ సినిమాలోని ఓ పాటలో దీపికా పదుకుణే వేసుకున్న దుస్తులు, వాటి రంగుపై ఆయన అభ్యంతరాలు వ్యక్తం చేశారు. తాజాగా, మధ్యప్రదేశ్‌లో కన్నయ్య కుమార్ పాత్రపై నరోత్తం మిశ్రా విమర్శలు గుప్పించారు.

దీంతో గతంలో నరోత్త మిశ్రా చేసిన వ్యాఖ్యలను గుర్తుచేస్తూ ఇవాళ కన్నయ్య కుమార్ పలు కామెంట్స్ చేశారు. ” సినిమాలో దీపికా పదుకుణే వేసుకునే ఎలాంటి దుస్తులు వేసుకుంటోందన్న దానిపై కాకుండా, రాష్ట్రంలో మహిళలు, గిరిజనులు, దళితుల దుస్థితి ఎలా ఉందన్న విషయంపై ఆయన దృష్టి పెట్టాలి. రాష్ట్రంలో వారిపై అనేక దాడులు జరుగుతున్నాయి ” అని అన్నారు.

నరోత్తం మిశ్రా అంటే అందరి కంటే ఉత్తముడని, అటువంటి పేరును హోం మంత్రికి ఆయన తల్లిదండ్రులు పెట్టారని కన్నయ్య అన్నారు. అయితే, నరోత్తం చేసిన పనులు ఆయనను నికృష్ణంగా మార్చాయంటూ చురకలంటించారు. మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌ను కంస మామగా కన్నయ్య కుమార్ అభివర్ణించారు. కంస మామను కన్నయ్య (శ్రీ కృష్ణ భగవానుడు) లోకంలో లేకుండా చేశాడని చెప్పారు.

Supreme Court : మణిపూర్ హింస కేసు.. మైతేయ్ ల పిటిషన్ ను తిరస్కరించిన సుప్రీంకోర్టు