గర్ల్ ఫ్రెండ్‌కి థ్యాంక్స్‌: సివిల్స్ టాపర్

నిజమే తన గర్ల్ ఫ్రెండ్‌కి పబ్లిక్‌గా థ్యాంక్స్ చెప్పింది ఎవరో కాదు 2018 సివిల్స్ టాపర్ కనిషక్‌ కటారియా. ఇప్పటివరకు ప్రేమ వల్ల ప్రతీదానిలో వెనకపడిపోతాం అనుకునే భావనను పటాపంచలు చేశారు కనిషక్‌ కటారియా.

  • Publish Date - April 6, 2019 / 03:32 AM IST

నిజమే తన గర్ల్ ఫ్రెండ్‌కి పబ్లిక్‌గా థ్యాంక్స్ చెప్పింది ఎవరో కాదు 2018 సివిల్స్ టాపర్ కనిషక్‌ కటారియా. ఇప్పటివరకు ప్రేమ వల్ల ప్రతీదానిలో వెనకపడిపోతాం అనుకునే భావనను పటాపంచలు చేశారు కనిషక్‌ కటారియా.

నిజమే తన గర్ల్ ఫ్రెండ్‌కి పబ్లిక్‌గా థ్యాంక్స్ చెప్పింది ఎవరో కాదు 2018 సివిల్స్ టాపర్ కనిషక్‌ కటారియా. ఇప్పటివరకు ప్రేమ వల్ల ప్రతీదానిలో వెనకపడిపోతాం అనుకునే భావనను పటాపంచలు చేశారు కనిషక్‌ కటారియా.  నిజమైన ప్రేమ జీవితంలో ముందుకు వెళ్లేందుకు చేయూతగా నిలుస్తుందని అందుకు తన జీవితమే నిదర్శనం అని చెప్పుకొచ్చారు కనిషక్‌. యూపీఎస్సీ లాంటి ప్రతిష్టాత్మక పరీక్షలో విజయం సాధించిన తర్వాత గర్ల్‌ ఫ్రెండ్‌‌కి కనిషక్‌ థ్యాంక్స్ చెప్పడం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చకు వస్తుంది. ఐఐటీ బాంబేలో కంప్యూటర్‌ సైన్స్‌లో బీటెక్‌ చదివిన కటారియా నేషనల్ లెవెల్‌లో టాప్ ర్యాంక్ సాధించారు.

యూపీఎస్సీ పరీక్షలో ఆలిండియా టాపర్‌గా నిలిచిన కనిషక్‌ కటారియా మాట్లాడుతూ.. ‘ఈ విజయ సాధనలో నాకు తోడుగా నిలిచిన కుటుంబ సభ్యులకు, నా గర్ల్‌ఫ్రెండ్‌కి, స్నేహితులకు ధన్యవాదాలు. మీరిచ్చిన మద్దతుని ఎన్నటికి మరచిపోలేను. యూపీఎస్పీ పరీక్షలో నేను మొదటి ర్యాంక్‌ సాధించాననే విషయాన్ని ఇప్పటికి నమ్మలేకపోతున్నాను. ప్రజలు నన్ను మంచి అధికారిగా చూడాలని కోరుకుంటున్నారు. నా ఉద్దేశం కూడా అదే’ అంటూ వెల్లడించారు. కాగా సివిల్స్ లాంటి ముఖ్యమైన పరిక్షల్లో వ్యక్తి గర్ల్ ఫ్రెండ్ గురించి పబ్లిక్‌గా మాట్లాడడం ఇదే తొలిసారి. 
Read Also : మహేష్ ప్రాబ్లం ఏంటంటే: మహర్షి టీజర్ చూశారా?