Karnataka Bypolls Results : సీఎం బొమ్మైకి బిగ్ షాక్..కాంగ్రెస్,బీజేపీ చెరొక స్థానంలో విజయం

కర్ణాటకలో రెండు అసెంబ్లీ స్థానాలకు(హంగ‌ల్,సిండ్‌గీ)జరిగిన ఉప ఎన్నికల్లో అధికార బీజేపీ,విపక్ష కాంగ్రెస్ చెరొక స్థానంలో విజయం సాధించాయి. హంగ‌ల్ నియోజ‌క‌వ‌ర్గంలో

Karnataka

Karnataka Bypolls Results కర్ణాటకలో రెండు అసెంబ్లీ స్థానాలకు(హంగ‌ల్,సిండ్‌గీ)జరిగిన ఉప ఎన్నికల్లో అధికార బీజేపీ,విపక్ష కాంగ్రెస్ చెరొక స్థానంలో విజయం సాధించాయి. హంగ‌ల్ నియోజ‌క‌వ‌ర్గంలో కాంగ్రెస్ విజయం సాధించగా..సిండ్‌గీలో బీజేపీ విజయం సాధించింది. సిండ్‌గీలో బీజేపీ అభ్య‌ర్థి ర‌మేశ్ భూస‌నూర్ 31,185 ఓట్ల తేడాతో భారీ విజ‌యం సాధించారు. ర‌మేశ్ భూస‌నూర్‌కు 93,865 ఓట్లు రాగా.. ఆయ‌న స‌మీప ప్ర‌త్య‌ర్థి, కాంగ్రెస్ అభ్య‌ర్థి అశోక్ మ‌న‌గులికి 62,680 ఓట్లు వ‌చ్చాయి.

అయితే హంగ‌ల్ లో బీజేపీ ఓటమితో ఆ రాష్ట్ర ముఖ్య‌మంత్రి బ‌స‌వ‌రాజ్ బొమ్మైకి గ‌ట్టి ఎదురుదెబ్బ తగిలినట్లైంది. సీఎం బసవరాజ్ బొమ్మై సొంత జిల్లా హవేరీలోని హంగల్ లో కాంగ్రెస్ అభ్యర్థి శ్రీనివాస్ మానే 7,598 ఓట్ల తేడాతో విజయం సాధించారు. బొమ్మై సీఎంగా అధికార పగ్గాలు చేపట్టిన తర్వాత జరిగిన తొలి ఎన్నిక ఇదే. రాష్ట్రంలోని ఒక నియోజ‌క‌వ‌ర్గంలో భారీ మెజారిటీతో గెలిచిన బీజేపీ.. సీఎం సొంత జిల్లాలోని నియోజ‌వ‌ర్గంలో పరాజ‌యం పాలు కావ‌డం సీఎం బొమ్మై కు ఎదురుదెబ్బే.

హంగ‌ల్ లో విజయం సాధించిన అనంతరం శ్రీనివాస్ మానే మాట్లాడుతూ.. డబ్బు బలం ఓడిపోయిందని, ప్రజాబలం విజయం సాధించిందని అన్నారు. బీజేపీ ఎత్తుగడలను ఎదుర్కొనేందుకు తమ నేతలు చాలా కష్టపడ్డారని అన్నారు. రాష్ట్రంలో బీజేపీ చెత్త పాలనకు ప్రజలు సరైన తీర్పు ఇచ్చారన్నారు.

ALSO READ Ganga River : భూమిపై అత్యధిక మంది సందర్శించే యాత్రస్థలం గంగ