Siddaramaiah
Siddaramaiah: కర్ణాటక సీఎంగా సిద్ధరామయ్య పేరును ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఆయన పేరును కాంగ్రెస్ అధిష్ఠానం దాదాపు ఖరారు చేసినట్లే. సీఎం రేసులో సిద్ధరామయ్య ముందున్నారు. సిద్ధరామయ్య పేరునే కాంగ్రెస్ (Congress) అధిష్ఠానానికి సూచించారు పరిశీలకులు.
కర్ణాటక కాంగ్రెస్ ఎమ్మెల్యేల అభిప్రాయాలను ఏఐసీసీ పరిశీలకుల ద్వారా ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తెలుసుకున్నారు. మెజార్టీ ఎమ్మెల్యేలు సిద్ధరామయ్య వైపే మొగ్గు చూపినట్లు తెలిసింది. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. మే 18 లేదా 20న సిద్ధ రామయ్య సీఎంగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది. డీకే శివ కుమార్ తో కాంగ్రెస్ అధిష్ఠానం సంప్రదింపులు జరుపుతున్నట్లు సమాచారం.
డీకే శివకుమార్ (DK Shivakumar) కి ఉప ముఖ్యమంత్రి సహా కీలక శాఖలు, పార్టీలో కీలక బాధ్యతలు ఇచ్చే ఆలోచనలో కాంగ్రెస్ అధిష్ఠానం ఉంది. డీకే శివకుమార్ తానేం తిరుగుబాటు చేయబోనని అంటున్నారు.