Police Baahubali : పోలీసు బాహుబలి…స్కార్పియోను మెకానిక్ వద్దకు లాక్కెళ్లిన సీఐ

మరమ్మత్తులకు గురైన పోలీసు జీపును మెకానిక్ షెడ్ దాకా ఈడ్చుకు వెళ్లి నెటిజన్ల  చేత ప్రశంసలు అందుకుంటున్నారు కర్ణాటకలోని ఓ సర్కిల్ ఇన్‌స్పెక్టర్.

Police Baahubali

Police Baahubali : మరమ్మత్తులకు గురైన పోలీసు జీపును మెకానిక్ షెడ్ దాకా ఈడ్చుకు వెళ్లి నెటిజన్ల  చేత ప్రశంసలు అందుకుంటున్నారు కర్ణాటకలోని ఓ సర్కిల్ ఇన్‌స్పెక్టర్. కొప్పళ జిల్లా  యలబుర్గి సర్కిల్ ఇన్‌స్పెక్టర్ నాగరాజు ఒక కేసు విచారణ నిమిత్తం స్కార్పియో వాహనం స్వయంగా డ్రైవ్ చేసుకుంటూ స్ధానిక పభుత్వ ఆస్పత్రికి వెళ్లారు.

అక్కడ కేసు విచారణ పూర్తి చేసుకుని తిరిగి బయలుదేరుతుండగా వాహనం మొరాయించింది. ఎంత సేపు ప్రయత్నించినా వాహనం స్టార్ట్ కాలేదు.  అక్కడకు దగ్గరలో మెకానిక్ షెడ్ కోసం వెతకగా 20 మీటర్ల దూరంలో ఉన్నట్లు తెలిసింది.  దీంతో 20 మీటర్ల దూరంలో ఉన్న మెకానిక్ షాపు వరకు  ఆయన స్వయంగా  వాహనాన్ని లాక్కొని వెళ్లారు.

ఈసమయంలో కొందరు  ఆదృశ్యాలను తమ సెల్‌ఫోన్‌లో వీడియో తీసి సోషల్ మీడియాలో  పోస్ట్ చేశారు. అది చూసి పోలీసు బాహుబలి అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. శారీరక ధారుడ్యం ఉంటే  ఇలాంటి పనులు  చేయవచ్చని నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు.