సంకీర్ణంలో లుకలుకలు : రాజీనామాకు సిద్దమన్న కుమారస్వామి

కర్ణాటక సీఎం కుమారస్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తమ సీఎం సిద్దరామయ్యే అని అనడంపై కుమారస్వామి సీరియస్ గా స్పందించారు. అవసరమైతే తాను రాజీనామా చేయడానికి కూడా సిద్దమేనని కుమారస్వామి అన్నారు. కాంగ్రెస్ ఎమ్మెుల్యేలను కట్టడి చేయాల్సిన బాధ్యత ఆ పార్టీపై ఉందన్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు హద్దులు దాటి ప్రవర్తిస్తున్నారని అన్నారు. వీటన్నిటిని కాంగ్రెస్ నాయకులు గమనిస్తున్నారని, ఇది తనకు సంబంధం లేని విషయమని తెలిపారు. కొన్ని రోజులుగా కర్ణాటకలో సంకీర్ణ ప్రభుత్వం కూలిపోతుందంటూ బీజేపీ నేతలు చేస్తున్న ప్రచారానికి సీఎం వ్యాఖ్యలు మరింత బలం చేకూర్చినట్లయింది. కర్ణాటకలో కాంగ్రెస్-జేడీఎస్ సంకీర్ణ ప్రభుత్వం కొనసాగుతున్న విషయం తెలిసిందే.

అయితే సీఎం కుమారస్వామి వ్యాఖ్యలపై మాజీ సీఎం, సీఎల్పీ నేత సిద్దరామయ్య మాట్లాడుతూ.. మీడియా వ్యక్తులే సమస్యలు సృష్టిస్తున్నారని అన్నారు. సంకీర్ఱణ ప్రభుత్వం ఐదేళ్ల పాటు ఎటువంటి అంతరాయం లేకుండా కొనసాగుతుందని, తాను కుమారస్వామితో మాట్లాడినట్లు తెలిపారు.