Siddaramaiah Video: వాస్తు దోషం అంటూ మూసేసిన తలుపులు తెరిచి అందులో నుంచే వెళ్లిన సీఎం సిద్ధరామయ్య

దాన్ని ఎందుకు తెరవడం లేదని అడిగారు. అక్కడ పనులు జరుగుతున్నాయని సిబ్బంది చెప్పారు. వాస్తు దోషం కారణంగానే..

Siddaramaiah Video – Karnataka: వాస్తు దోషాల కారణంగా మూసేసిన తలుపులు తెరిచి అందులో నుంచే వెళ్లారు కర్ణాటక సీఎం సిద్ధరామయ్య. బెంగళూరు(Bengaluru)లోని విధాన సౌధ(Vidhana Soudha)లో తన ఛాంబర్‌కు వెళ్లడానికి సిద్ధరామయ్య వచ్చారు. విధాన సౌధ మూడో అంతస్తులోని ఆయన ఛాంబర్ పశ్చిమ దిక్కుగా ఉన్న తలుపులు మూసేసి ఉండడాన్ని ఆయన గమనించారు.

దాన్ని ఎందుకు తెరవడం లేదని అడిగారు. అక్కడ పనులు జరుగుతున్నాయని సిబ్బంది చెప్పారు. వాస్తు దోషం కారణంగానే చాలా కాలంగా ఆ తలుపులు తెరవట్లేదని సిద్ధరామయ్య తెలుసుకున్నట్లు తెలుస్తోంది. అయినప్పటికీ ఆ తలుపులు తెరవాలని సిద్ధరామయ్య ఆదేశించారు.

చివరకు సిబ్బంది ఆ తలుపులు తెరిచారు. కాగా, ఎన్నికల ముందు ఇచ్చిన హామీల అమలు విషయంలో సిద్ధరామయ్య అధికారులతో ఇవాళ చర్చించారు. అన్నభాగ్య యోజన అమలుకు సంబంధించి ఉన్నతాధికారులతో విధానసౌధలో సమావేశం నిర్వహించారు.

కర్ణాటకలో 10 కిలోల ఉచిత బియ్యం అందించే అన్నభాగ్యతో పాటు ప్రతి ఇంటికి నెలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అందించే గృహ జ్యోతి, కుటుంబ పెద్దగా ఉన్న ప్రతి మహిళకు ప్రతి నెల రూ.2,000 ఇచ్చే గృహ లక్ష్మి, నిరుద్యోగ గ్రాడ్యుయేట్లకు భృతి అందించే యువ నిధి, ఆర్డినరీ పబ్లిక్ ట్రాన్స్‌పోర్టు బస్సుల్లో మహిళలు ఉచిత ప్రయాణం చేయడానికి శక్తి పథకాలను కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ప్రకటించింది.

Mutiny in Russia: అప్పట్లో ఓ ఖైదీ.. ఇప్పుడు సొంత దేశ అధ్యక్షుడినే వణికిస్తున్న ప్రిగోజిన్.. ఇంత ధైర్యం ఎక్కడిది?

ట్రెండింగ్ వార్తలు