డిఫరెంట్ దీపావళి : ఆ 7 గ్రామాల్లో వెలుగుల పండుగలో వింత ఆచారం

  • Publish Date - November 17, 2020 / 12:31 PM IST

karnataka diwali festival at defrent seven villagers : భారతదేశం భిన్న మతాల కలయిక. భిన్నత్వంలో ఏకత్వం..ఏకత్వంలో భిన్నత్వం భారత్ కే సొంతం. భారతీయులు చేసుకునే పండుగల్లో ప్రాంతాలను బట్టి తేడాలుంటాయి. అలాగే పండుగలను అందరూ ఒకేలా చేసుకోరు.. ఒకేసారి చేసుకోరు. అటువంటి పండుగల్లో దీపావళి పండుగ కూడా ఒకటి.



కర్ణాటకలో వింత గ్రామాలు
ఈ సంవత్సరం దీపావళి పండుగ (నవంబర్ 14,2020) అయిపోయి మూడు రోజులైంది. ఈరోజు 17వ తేదీ. కరోనా సమయం కాబట్టి దేశమంతా దీపావళి పండుగను పెద్దగా సెలబ్రేట్ చేసుకోలేదు.బాణసంచాపై ఉండే నిషేధంతో కొన్ని ప్రాంతాల్లో వారి వారి అభిప్రాయాలనుబట్టి చేసుకున్నారు. ఈక్రమంలో దీపావళి పండుగకు చేసుకన్న చేసుకున్న స్వీట్లు, తెచ్చుకున్న టపాసులు కూడా అయిపోయాయి.. కానీ భారతదేశంలోని కర్ణాటక రాష్ట్రంలోని ఆ ఏడు గ్రామాల్లో మాత్రం ఇంకా దీపావళి పండుగ అవ్వలేదు.



వింత నమ్మకాల గ్రామాలు
దేశమంతా నవంబర్ 14న దీపావళి చేసుకుంటూ కర్ణాటకలోని ఈ ఏడు గ్రామాల ప్రజలకు మాత్రం ఇంకా దీపావళి ఆ పండుగ మిగిలే ఉంది. ఆ ఏడు గ్రామాల ప్రజలు రేపు బుధవారం (నవంబర్ 18,2020) పండుగ చేసుకోబోతున్నారు. దేశమంతా ఒకే రోజు చేసుకుంటే వీరు మాత్రం రేపు చేసుకోవటమేంటీ? కారణమేంటీ అనే డౌట్ వచ్చే ఉంటుంది కదూ? మరి డౌట్ వచ్చిదంటే తీర్చేసుకోవాలి కదా..మరి ఇంకెందుకు లేట్..ఇది చదవండి.
https://10tv.in/doctor-dresses-up-as-batman-to-fulfil-cancer-patients-dream-watch-viral-video/


దీపాలు వెలిగించరు..టపాసులు పేల్చరు
కర్నాటకలోని ఏడు గ్రామాల ప్రజలు 14న దీపావళి జరుపుకోలేదు. దీపాలు వెలిగించలేదు. టపాసులు కాల్చలేదు. బుధవారం దీపావళి చేసుకోబోతున్నారు. చమరాజనగర్ జిల్లాలోని ఏడు గ్రామాల ప్రజలకు ఇదో ఆచారం. వారంతా బుధవారం తప్ప వారంలో ఏ రోజు దీపావళి వచ్చినా.. పండుగను జరుపుకోరు. ఈ ఏడాది దీపావళి శనివారం రావడంతో ఆ ఏడు గ్రామాల ప్రజలు పండుగ చేసుకోలేదు.



ఆ ఏడు గ్రామాల ప్రజలు వింత నమ్మకాలు
చమరాజనగర్ లోని ఇంతకీ ఆ ఏడు గ్రామాల పేర్లు..గుండ్లూపేట తాలూకాలోని మాలవల్లి, వీరనాపుర, మద్రల్లి, బన్ని తాల్పూర్, బెండకలి, నెనెకట్టె, నల్లూరు. ఈ గ్రామాల్లో తర తరాలుగా..తాత ముత్తాతల కాలం నుంచి ఓ ఆచారం కొనసాగుతోంది. వారంలో ఒక్క బుధవారం రోజు తప్ప మిగతా వారంలోని ఏ రోజూ దీపావళి జరుపుకోరు వారు. బుధవారం కాకుండా ఏ రోజు దీపావళి చేసుకున్నా.. అది మంచిది కాదని వారి నమ్మకం.ఒకవేళ సంప్రదాయాన్ని కాదని మిగతా రోజుల్లో పండుగ చేసుకుంటే అది ప్రజలకే గాక..ఆ గ్రామాల్లోని పశువులకు కూడా కీడు జరుగుతుందని నమ్ముతారు.


ఇంగళవాడి దేవత మహదేశ్వర ఆలయంలో మొక్కులు తప్పనిసరి
ఈ ఏడు గ్రామాలలో దీపావళి చేసుకునే సమయంలో ఇంగళవాడి దేవత మహదేశ్వర ఆలయం దగ్గరకు వెళ్లి.. మొక్కులు తీర్చుకుంటారు. అదే రోజున అన్ని రకాల పిండివంటలు చేసుకుంటారు. పాడి పశువులకు, ఇంట్లో పెంచుకునే ఇతర జంతువులకు ఆ పంచభక్ష్య పరమాన్నాలను పెడతారు. రైతన్నలకు వ్యవసాయంలో అండదండగా ఉండే ఎద్దులు, ఆవులు, గేదెలను అలంకరించి.. వాటికి నువ్వులతో చేసిన పదార్థాలను పెడతారు.


బుధరవారం రోజు మాత్రమే చేసుకునేే దీపావళి పండుగ
బుధవారం నాడే దీపాలు వెలిగిస్తామని.. అదే రోజు టపాసులు కాల్చుకుంటారు ఆ ఏడు గ్రామాల ప్రజలు. అదేమరి భారతదేశంలోని విశిష్టత. భిన్న మతాలు,కులాలు,తెగలు, విభిన్న సంస్కృతులు..విభిన్న ఆచారాలు.. విభిన్న మనుష్యులు.. అందుకే ప్రపంచ దేశాల్లోకెల్లా భారత్ విలక్షణ దేశం అని పేరు.