Karnataka Election Results 2023 : జేడీఎస్ కంచుకోట మైసూర్‌లోనూ కాంగ్రెస్ ఆధిక్యం

కర్ణాటక ఎన్నికల ఫలితాల్లో హవా కొనసాగిస్తున్న కాంగ్రె జేడీఎస్ కంచుకోట మైసూర్ లోనూ కాంగ్రెస్ ఆధిక్యం కనబరుస్తోంది. అలాగే కోస్టల్ కర్ణాటక, ముంబై కర్ణాటకలో కూడా ఆధిక్యతను కొనసాగి కర్ణాటకలో మెజారిటీ స్థానాల్లో ముందంజలో ఉంది హస్తం పార్టీ. దీంతో దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్నారు.

Karnataka Election Results 2023

Karnataka Election Results 2023 : కర్ణాటక ఎన్నికల ఫలితాల్లో హవా కొనసాగిస్తున్న కాంగ్రె జేడీఎస్ కంచుకోట మైసూర్ లోనూ కాంగ్రెస్ ఆధిక్యం కనబరుస్తోంది. అలాగే కోస్టల్ కర్ణాటక, ముంబై కర్ణాటకలో కూడా ఆధిక్యతను కొనసాగి కర్ణాటకలో మెజారిటీ స్థానాల్లో ముందంజలో ఉంది హస్తం పార్టీ. దీంతో దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్నారు. అదే సమయంలో గెలుపు దిశగా కొనసాగుతున్న తమ అభ్యర్థులను ముందస్తు జాగ్రత్తగా బెంగళూరుకు తరలిస్తోంది కాంగ్రెస్.

వరుణ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి సిద్ధరామయ్య ఆధిక్యంలో కొనసాగుతున్నారు. అలాగే చిత్తాపూర్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థి ప్రియాంక ఖర్గే కూడా ఆధిక్యంలో ఉన్నారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల లెక్కింపు ఎర్లీ ట్రెండ్స్ లో కాంగ్రెస్ పార్టీ పూర్తి ఆధిక్యతను కనబరుస్తుంటే మరోపక్క బీజేపీ కీలక నేతలు వెనుకబడి ఉండటం గమనించాల్సిన విషయం.

ఇప్పటివరకు అందిన సమాచారం మేరకు బీజేపీ 77-80 మధ్యలో ఉంటే కాంగ్రెస్ 113 మ్యాజిక్ ఫిగర్ దాటేసి 117 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. దీంతో కర్ణాటకలోనే కాకుండా దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్నారు.

క్యాంపుకు కాంగ్రెస్ అభ్యర్థులు ..
కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు అత్యధిక స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతున్నారు. మ్యాజిక్ పిగర్ 113 స్థానాలకు‌గాను కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు 114 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతున్నారు. దీంతో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం అప్రమత్తమైంది. ఆధిక్యంలో ఉన్న కాంగ్రెస్ అభ్యర్థులను ఈగల్ టన్ రిసార్ట్‌కు తరలిస్తుంది.

ఆధిక్యంలో ఉన్న నేతలు..
చిత్తాపూర్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థి ప్రియాంక ఖర్గే.
శికారిపుర నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థి విజయేంద్ర.
గంగావతి నియోజకవర్గం నుంచి కేఆర్‌పీపీ అభ్యర్థి గాలి జనార్ధనరెడ్డి.
రామనగర నియోజకవర్గం నుంచి జేడీఎస్ అభ్యర్థి నిఖిల్ కుమార్ స్వామి.
కొరటగెరె నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థి జి. పరమేశ్వర.
వరుణ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి సిద్ధరామయ్య ఆధిక్యంలో ఉన్నారు.