Karnataka Legislative Assembly elections
Karnataka: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 136 స్థానాల్లో గెలుపొందింది. బీజేపీ (BJP) 65 సీట్లకే పరిమితం అయింది. జేడీఎస్ (JDS) 19 సీట్లు, కల్యాణ రాజ్య ప్రగతి పక్షం పార్టీ, సర్వోదయ కర్ణాటక పక్షం పార్టీ ఒక్కో సీటు చొప్పున గెలుచుకున్నాయి. అలాగే, ఇద్దరు స్వతంత్ర అభ్యర్థులు విజయం సాధించారు. 113 స్థానాలు గెలుచుకున్న పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయొచ్చు. కాంగ్రెస్ కి అంతకంటే 23 సీట్లు ఎక్కువ వచ్చాయి. దీంతో కాంగ్రెస్ జేడీఎస్ మద్దతు లేకుండానే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది.
2018లో ఏ పార్టీకి ఎన్ని సీట్లు?
కర్ణాటకలో 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఓటర్లు ఏ పార్టీకీ మెజార్టీ ఇవ్వలేదు. గత ఎన్నికల్లో బీజేపీ 104, కాంగ్రెస్ 80, జేడీఎస్ 37 సీట్లు గెలుచుకుున్నాయి. ఇక స్వతంత్ర అభ్యర్థి, బీజేఎస్పీ, కేపీజేపీకి ఒక్కో సీటు దక్కాయి. ఆ ఎన్నికల్లో హంగ్ ఏర్పడింది. చివరకు జేడీఎస్ నేత కుమారస్వామికి సీఎం పదవిని అప్పజెప్పుతూ జేడీఎస్ తో కలిసి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. రెండేళ్ల తర్వాత ఆ ప్రభుత్వం కుప్పకూలి బీజేపీ సర్కారు ఏర్పడింది.
గత ఎన్నికల్లో..
జై కిసాన్ ఆందోళన్ నేత యోగేంద్ర యాదవ్.. గతంలో ఏ పార్టీ అత్యధిక సీట్లు సాధించిందన్న విషయంపై ట్వీట్ చేశారు.
Yogendra Yadav tweet
ఎన్నికల్లో గెలవడంతో బెంగళూరులో రేపు సాయంత్రం 5.30 గంటలకు కర్ణాటక కాంగ్రెస్ శాసనసభా పక్షం సమావేశం కానుంది. ముఖ్యమంత్రి అభ్యర్థి ఎన్నికపై కొత్త ఎమ్మెల్యేలు చర్చించనున్నారు. కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడంతో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నందిని బ్రాండ్ స్వీట్లను తమ నేతలకు పంచారు. కర్ణాటక ఎన్నికల్లో అమూల్ Vs నందిని బ్రాండ్ల విషయంలో మాటల యుద్ధం కొనసాగిన విషయం తెలిసిందే.