karnataka Night Curfew : కర్ణాటకలో నైట్ కర్ఫ్యూ ఎత్తివేత

కరోనా వైరస్ వ్యాప్తి కేసుల సంఖ్య తగ్గడంతో రాష్ట్రవ్యాప్తంగా అమల్లో ఉన్న నైట్ కర్ఫ్యూను ఎత్తివేస్తున్నట్టు శుక్రవారం కర్ణాటక ప్రభుత్వం ప్రకటించింది.

Karnataka (1)

karnataka Night Curfew:  కరోనా వైరస్ వ్యాప్తి కేసుల సంఖ్య తగ్గడంతో రాష్ట్రవ్యాప్తంగా అమల్లో ఉన్న నైట్ కర్ఫ్యూను ఎత్తివేస్తున్నట్టు శుక్రవారం కర్ణాటక ప్రభుత్వం ప్రకటించింది. వాక్సినేషన్ కవరేజ్ పెరగడం, కోవిడ్ కేసులు తగ్గడంతో కర్ణాటక ప్రభుత్వం తాజా నిర్ణయం తీసుకుంది.

కోవిడ్ సెకండ్ వేవ్ నేపథ్యంలో జులై -3,2021 నుంచి ప్రతి రోజూ రాత్రి 10 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకూ అమలు చేస్తున్న కర్ఫ్యూను ఉపసంహరించుకుంటున్నట్టు శుక్రవారం కర్ణాటక చీఫ్ సెక్రటరీ పి. రవి కుమార్ ఆదేశాలు జారీ చేశారు. తక్షణమే ఈ ఆదేశాలు అమల్లోకి వచ్చినట్టు తెలిపారు.

అంతేకాకుండా, హార్స్ రేసింగ్‌కు కూడా తిరిగి అనుమతిస్తున్నట్టు చెప్పారు. ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ఆదేశాలు, కరోనా నిబంధనలను కఠినంగా పాటించాలని స్పష్టం చేశారు. హార్స్ రేసింగ్ ప్లేస్ లో సీట్ల సామర్థ్యానికి అనుగుణంగానే రేసింగ్ పాట్రన్లను అనుమతించాలని, వారు కూడా పూర్తి వ్యాక్సినేషన్ డోసులు తీసుకుని ఉండాలని ఆ ఆదేశాల్లో స్పష్టం చేశారు.

ALSO READ QR code on Gangireddu : గంగిరెద్దుకు QR కోడ్‌..ఇది డిజిటల్‌ చెల్లింపుల విప్లవం అంటున్న మంత్రి నిర్మలా సీతారామన్