Karnataka Mandya : సుమలతను ఆనకట్టకు అడ్డంగా పెడితే నీళ్లు లీక్ అవ్వవు

Mandya MP Sumalatha : కర్ణాటకలోని మాండ్య నియోజక వర్గం ఎంపీ సుమలపై మాజీ సీఎం కుమారస్వామి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మాండ్య జిల్లాలోని కృష్ణరాజసాగర జలాశయం చుట్టూ అక్రమంగా గనుల తవ్వకంతోపాటు ఇసుక దందా కొనసాగుతోందని..ఈ ప్రభావం జలాశయంపై పడుతోందని ఫలితంగా జలాశయానికి పగుళ్లు ఏర్పడుతున్నాయని ఎంపీ సుమలత ఇటీవల ఆరోపించారు. సుమలత చేసిన ఈ వ్యాఖ్యలపై మాజీ సీఎం కుమారస్వామి ఘాటు వ్యాఖ్యలతో ‘‘జలాశయం కృష్ణరాజ సాగర (కెఆర్ఎస్)ఆనకట్టకు ప్రమాదం ఏర్పడితే..సుమలతను అడ్డంగా ఉంచితే నీళ్లు లీక్ అవ్వకు..వాటర్ బయటకు రావు’’అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

సరైన సమాచారం లేకుండా ఆరోపణలు చేయడం సరికాదని మండిపడ్డారు కుమారస్వామి. భర్త అంబరీష్ మరణాన్ని సెంటిమెంట్ గా చేసుకుని దాన్నే ప్రచారంగా చేసుకుని సుమలత ఎన్నికల్లో గెలిచారని ఎధ్దేవా చేశారు. భర్త మరణం సింపతీని ఓట్లుగా మార్చుకుని ఎంపీ అయిన సుమలత వల్ల మాండ్య నియోజకవర్గానికి ఒరిగిందేమీ లేదనీ..ప్రజలకు ఆమె చేసింది ఏమీ లేదని విమర్శించారు కుమారస్వామి. కుమారస్వామి చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. ఈ వ్యాఖ్యలపై సుమలత కూడా అంతే ఘాటుగా స్పందించారు. ఇటువంటి వ్యాఖ్యలు చేసి కుమారస్వామి ఆలోచనావిధనం ఏంటో నిరూపించుకున్నారని..ఆయన తనపై చేసిన వ్యాఖ్యలపై మహిళా కమిషన్ కు ఫిర్యాదు చేస్తానని అన్నారామె.

జరుగుతున్న నష్టం గురించి తను మాట్లాడితే కుమారస్వామి అవినీతి పరులకు మద్దతుగా మాట్లాడుతున్నారని దీన్ని బట్టి ఆయన ఉద్ధేశ్యం ఏమిటో అర్థం చేసుకోవచ్చని అన్నారు మాండ్య ఎంపీ సుమలత. ఎన్నికల్లో కుమారస్వామి కుమారుడు నిఖిల్‌పై సుమలత ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీచేసి విజయం సాధించిన విషయం తెలిసిందే. గతంలో మాండ్య నియోజవర్గంలో సుమలత భర్త..ప్రముఖ నటుడు అంబరీష్ ఎంపీగా ఉన్న విషయం తెలిసిందే. ఆయన మరణం తరువాత సుమలత అదే నియోజకవర్గంలో ఇండిపెంటెంట్ అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు.

కాగా గతంలో కూడా కుమారస్వామి సుమలతపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మాండ్య నియోజకవర్గంలో ఆమె పోటీ చేస్తానని ప్రకటించిన క్రమంలో కుమారస్వామి మాట్లడుతూ..‘సుమలతకు భర్త అంబరీష్ చనిపోయాడనే కనీస బాధ ఆమె ముఖంలో కనపడటం లేదని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై కూడా ఆమె కుమారస్వామికి ఘాటు కౌంటర్ ఇచ్చారు. ఒక రాష్ట్రానికి సీఎం అయిన కుమారస్వామి ఇలాంటి వ్యాఖ్యలు చేయటం సరైన పద్దతేనా?ఇదేనా మహిళలపై ఆయనకున్న గౌరవం అని సుమలత ప్రశ్నించారు.

ట్రెండింగ్ వార్తలు