Karnataka mla jn ganesh daughter Farming : ఓచిన్నారి తన చిట్టి చేతులతో పొలంలో వరినాట్లు వేసింది. ఆ చిన్నారి చేసే పొలం పనులు చూసి తల్లిదండ్రులేకాదు అక్కడున్న్ కూలీలు కూడా తెగ సంబరపడిపోయారు. ఇంతకూ ఆ చిన్నారి ఓ ఎమ్మెల్యే కూతురు కావటం విశేషం. ఆచిన్నా పేరు ఆరాధ్యానాయక్.
కర్ణాటకలోని కంప్లి ఎమ్మెల్యే జేఎన్ గణేష్ కుమార్తె ఆరాధ్యా నాయక్. 4th క్లాస్ చదువుతోంది. కరోనా కారణంగా స్కూల్స్ మూసివేశారు. ఆన్ లైన్ పాఠాలతో ఇంటిలోనే ఉండి చదువుకుంటోంది ఆరాధ్య. రోజు ఇంటిలోనే ఉండటంతో తెగ బోర్ కొడుతోంది. పైగా పొలం పనులంటే చాలా ఇష్టం ఆరాధ్యకు. రోజు పొలం వెళ్లి కూలీలు చేసే పనులు పరిశీలించేది.
దీంతో తన చిన్నారికి పొలం పనులపై ఉన్న ఆసక్తి గురించి తెలుసుకున్న తల్లి కూతుర్ని పంపించింది. దీంతో గెంతులు వేసుకుంటూ పొలం వచ్చిన ఆరాధ్య నేను కూడా వరినాట్లు వేస్తానని ఉత్సాహంగా చేలోకి దిగింది. అలా మంగళవారం (డిసెంబర్ 29,2020) కూలీలతో నాట్లు వేయడాన్ని నేర్చుకుంది ఆరాధ్య..
చకచకా నాట్లు వేస్తూ అందరినీ ఆశ్చపరిచింది. ఇలా చూసి అలా వరినాట్లు వేసిన చిన్నారి ఆరాధ్యను చూసిన కూలీలు భలేవేసావమ్మా..అంటూ మెచ్చుకున్నారు. వ్యవసాయం పనులంటే తమ కూతురికి చాలా ఇష్టం అని..కూతురు వరినాట్లు వేయటాన్ని చూసిన ఎమ్మెల్యే గణేష్ దంపతులు తెగ మురిసిపోయారు.