ద్యావుడా : స్మార్ట్ ఫోన్ ఆర్డర్ చేస్తే సోన్ పాపిడి వచ్చింది

  • Publish Date - November 20, 2020 / 11:27 AM IST

karnataka online fraudsters cheating : ఆన్‌లైన్‌ వంచకులు తీయని మాటలతో అమాయకులను బురిడీ కొట్టిస్తున్నారు. కారుచవగ్గా ఖరీదైన వస్తువులు మీవేనంటూ వచ్చే ఫోన్లకు జనం నిజమేనని నమ్మడం మోసగాళ్లకు కలిసొస్తోంది.



కర్ణాటక రాష్ట్రం చిత్రదుర్గం జిల్లా చెళ్లకెరె తాలూకాలోని గోపనహళ్లి గ్రామానికి చెందిన నరసింహమూర్తి ఆన్ లైన్ లో స్మార్ట్ ఫోన్ ఆర్డర్ చేశాడు. ఎంతో కాలంలో కొనుక్కోవాలనుకుంటున్న ఫోన్ ను ఈనాటికి కొనుక్కోగలుగుతున్నాననీ..ఆర్డర్ చేసిన స్మార్ట్ ఫోన్ ఎప్పుడొస్తుందాని ఆశగా ఎదురు చూస్తున్నాడు.


అనుకున్న టైమ్ కు పార్శిల్ వచ్చింది. ఎంతో ఆతృతగా ఆశగా పార్శిల్ విప్పి చూశాడు. ఆ వెంటనే షాక్ అయ్యాడు. పార్శిల్ లో స్మార్ట్ ఫోన్ కు బదులు సోంపాపిడి పార్శిల్ ఉంది. దీంతో తను కట్టిన డబ్బుల సంగతి అంతేనా అంటూ లబోదిబో మన్నాడు.



వివరాల్లోకి వెళితే..నరసింహమూర్తి దీపావళి పండుగ సందర్భంగా శాంసంగ్‌ గెలాక్సీ మొబైల్‌ఫోన్‌ను రూ. 1,700 కే అందిస్తున్నామని ఒక వ్యక్తి ఫోన్‌ చేశాడు. పోస్టల్‌ శాఖ నుంచి పార్శిల్‌ వస్తుందని, డబ్బు చెల్లించి తీసుకోవాలని చెప్పాడు. దీంతో నరసింహమూర్తి తక్కువధరకే స్మార్ట్‌ఫోన్‌ వస్తోందని ఆశపడ్డాడు. మురిసిపోయాడు.
https://10tv.in/ap-anantapur-a-cow-that-has-been-milking-continuously-for-nine-years/


వెంటనే బుక్ చేశాడు. అనంతరం గురువారం (నవంబర్ 19,2020) బెంగుళూరు హెబ్బాళ నుంచి గోపనహళ్లి పోస్ట్ ఆఫీసుకు నరసింహమూర్తి పేరుమీద ఓ పార్శిల్‌ వచ్చింది. ఆయన రూ.1700 చెల్లించి పార్సల్‌ తీసుకుని చూడగా, ఫోన్‌కు బదులు 50 రూపాయల సోం పాపిడి మిఠాయి పెట్టె, ఓ రోల్డ్‌ గోల్డ్‌ చైన్‌ కనిపించింది. దీంతో నరసింహమూర్తి నిర్ఘాంతపోయాడు. మోసపోయానని తెలుసుకుని లబోదిబోమన్నాడు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేస్తానని తెలిపాడు.