Final Rituals : కోవిడ్ తో మరణించిన 560 మందికి మంత్రి అంత్యక్రియలు

కర్ణాటక రెవెన్యూ శాఖ మంత్రి ఆర్‌ అశోక ఉదారతను చాటుకున్నారు.

Final Rituals కర్ణాటక రెవెన్యూ శాఖ మంత్రి ఆర్‌ అశోక ఉదారతను చాటుకున్నారు. కరోనాతో చనిపోయిన 560 మంది మృతదేహాలకు అంత్యక్రియలు నిర్వహించేందుకు కుటుంబ సభ్యులు ఎవరూ ముందు రాకపోవడంతో మంత్రే స్వయంగా సామూహిక అంతిమ సంస్కారాలు నిర్వహించారు. మరణించిన వారి అస్థికలను బెలకావడిలోని కావేరి నదిలో కలిపారు.

కొద్దిరోజులుగా ఉత్తర భారతంలోని గంగా నదిలో మృతదేహలు తేలుతున్న ఘటన తనను ఎంతగానో కలిచి వేసిందని మంత్రి అశోక చెప్పారు. ఈ క్రమంలోనే కరోనా మృతదేహాలకు గౌరవంగా అంత్యక్రియలు జరపాలని నిర్ణయించుకున్నట్లు స్పష్టం చేశారు.

కరోనా సమయంలో ప్రాణాలు కోల్పోయినవారందరికీ గౌరవంగా అంత్యక్రియలు జరగాలనే తమ ప్రభుత్వం కూడా కోరుకుంటున్నట్లు మంత్రి చెప్పారు. మృతుల కుటుంబ సభ్యులు కష్టకాలాన్ని ఎదుర్కొంటున్నారన్న మంత్రి.. వారి బాధను ప్రభుత్వం పంచుకునేందుకు సిద్ధంగా ఉందన్నారు. ఇది భావోద్వేగంతో కూడిన అంశమని, మృతుల కుటుంబాలకు అండగా నిలుస్తామని మంత్రి అశోక తెలిపారు.

ట్రెండింగ్ వార్తలు