మేకలు, గొర్రెలకు కరోనా టెస్టులుచేశారు. మనుషుల మీదనే కాదు జంతువుల మీద కూడా కరోనా మహమ్మారి దాడికి చేస్తోందా? అంటే అవుననే ఘటనలు జరుగుతున్నట్లుగా ఉంది.
కర్ణాటకలోని తుమకూరు ప్రాంతంలోని చిక్కనాయకహల్లిలోని ఓ వ్యక్తి గొర్రెలు, మేకల్ని పెంచుకుంటున్నాడు. ఆ మూగజీవాలు ఇటీవల శ్వాస తీసుకోవటానికి ఇబ్బందులు పడుతున్నాయి. దీన్ని గమనించిన ఆ యజమాని వాటికి కరోనా సోకిందేమోనన్న అనుమానంతో వైద్యాధికారులకు సమాచారం అందించాడు. వెంటనే వచ్చిన అధికారులు మేకలు, గొర్రెలతోపాటు యజమానికి కూడా కరోనా పరీక్షలు నిర్వహించారు.
దీనిపౌ డాక్టర్లు మాట్లాడుతూ..గొర్రెలు, మేకలకు కరోనా పరీక్షలు నిర్వహించామని..ఆ తరువాత ముందు జాగ్రత్తగా 50 మేకలు, గొర్రెలను ఐసోలేషన్‌లో ఉంచామని వైద్య, ఆరోగ్య శాఖ తెలిపింది.కరోనా పరీక్షలు చేశామని వాటి ఫలితాల కోసం ఎదురుచూస్తున్నామని తెలిపారు. మూగజీవాలు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతుండడంపై జిల్లా కమిషనర్ కె.రాకేశ్ కుమార్ విచారణ చేపట్టారు.
కరోనా సోకడం వల్లే మేకలు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతున్నాయని కచ్చితంగా చెప్పలేమని..కానీ ముందు జాగ్రత్తగా వాటికి కరోనాపరీక్షలు నిర్వహించామని పశువైద్యులు తెలిపారు.మైకోప్లాస్మా ఇన్‌ఫెక్షన్ చేరినా ఇలాంటి లక్షణాలే కనిపిస్తాయని చెబుతున్నారు. జీవాల నుంచి సేకరించిన నమూనాలను భోపాల్‌లోని యానిమల్ హెల్త్ అండ్ వెటర్నరీ బయోలాజికల్స్ అండ్ వెటర్నరీ లాబొరేటరీకి పంపామని తుమ్కూరు పశుసంవర్ధక విభాగం డిప్యూటీ డైరెక్టర్ కెజి నందిష్ చెప్పారు.ఈ గొర్రెలు..మేకలు సంరక్షణ చూసే కాపరికి మాత్రం కరోనా పాజిటివ్ అని వచ్చింది. మరి అతనినుంచే ఈ మేకలకు..గొర్రెలకు కరోనా వచ్చిందా? అసలు అలా జంతువులకు మనుషుల నుంచి కరోనా వస్తుందా? అనేకోణంలో దర్యాప్తు కొనసాగుతోంది.