ఓలా, ఉబర్‌లకు సర్కార్ షాక్ : నోటీసులు జారీ

బెంగళూరు : దేశీ దిగ్గజ ట్యాక్సీ సేవల సంస్థలు ఓలా, ఉబర్‌లకు కర్నాటక రవాణ శాఖ షాక్ ఇచ్చింది. ఓలా, ఉబర్ యాజమాన్యాలకు నోటీసులు ఇచ్చింది. చైల్డ్ లాక్ ఫీచర్‌ను డిసే‌బుల్

  • Published By: veegamteam ,Published On : January 24, 2019 / 06:11 AM IST
ఓలా, ఉబర్‌లకు సర్కార్ షాక్ : నోటీసులు జారీ

Updated On : January 24, 2019 / 6:11 AM IST

బెంగళూరు : దేశీ దిగ్గజ ట్యాక్సీ సేవల సంస్థలు ఓలా, ఉబర్‌లకు కర్నాటక రవాణ శాఖ షాక్ ఇచ్చింది. ఓలా, ఉబర్ యాజమాన్యాలకు నోటీసులు ఇచ్చింది. చైల్డ్ లాక్ ఫీచర్‌ను డిసే‌బుల్

బెంగళూరు : దేశీ దిగ్గజ ట్యాక్సీ సేవల సంస్థలు ఓలా, ఉబర్‌లకు కర్నాటక రవాణ శాఖ షాక్ ఇచ్చింది. ఓలా, ఉబర్ యాజమాన్యాలకు నోటీసులు ఇచ్చింది. చైల్డ్ లాక్ ఫీచర్‌ను డిసే‌బుల్ చేయని కారణంగా రవాణ శాఖ అధికారులు సీరియస్ అయ్యారు.

 

హైకోర్టు ఆదేశాల ప్రకారం ఓలా, ఉబర్ కార్లలోని చైల్డ్ లాక్ సిస్టమ్‌ను డిసేబుల్ చేయాలి. ఈ ఫీచర్ కారణంగా మహిళలకు ప్రమాదం పొంచి ఉందని, మహిళా ప్రయాణికులు ఆ ఫీచర్ సురక్షితం కాదని అధికారులు గుర్తించారు. దీంతో వెంటనే ఆ ఫీచర్‌ను తొలగించాలని హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. న్యాయస్థానం ఆదేశాలతో రవాణశాఖ అధికారులు ఓలా, ఉబర్ సంస్థలకు ఉత్తర్వులు జారీ చేశారు.

 

కర్నాటక రాష్ట్రంలో రెండున్నర లక్షల కార్లు ఉంటే.. కేవలం 42వేల కార్లకు మాత్రమే చైల్డ్ లాక్ ఫీచర్‌ను డిసేబుల్ చేశారు. ఇంకా చాలా కార్లకు చేయాల్సి ఉంది. ఈ వ్యవహారం మరోసారి హైకోర్టుకి చేరడంతో న్యాయస్థానం రవాణశాఖ అధికారులపై సీరియస్ అయ్యింది. దీంతో రవాణశాఖ అధికారులు అలర్ట్ అయ్యారు. చైల్డ్ లాక్ ఫీచర్‌ను డిసేబుల్ చేయని ఓలా, ఉబర్ డ్రైవర్లకు నోటీసులు జారీ చేశారు. మీ లైసెన్సులు ఎందుకు రద్దు చేయకూడదో చెప్పాలని అడిగారు.

 

చైల్డ్ లాక్ ఫీచర్‌ను డిసేబుల్ చేసేలా కర్నాటక మోటార్ వాహన చట్టంలో మార్పులు చేశారు. 2018 డిసెంబర్ 14వ తేదీ నుంచి ఈ ఉత్తర్వులు అమల్లోకి వచ్చాయి. 2019 జనవరి 16వ తేదీ కల్లా అన్ని కార్లలో చైల్డ్ లాక్ సిస్టమ్‌ను డిసేబుల్ చేయాలని చెప్పారు. అయినా చాలామంది బేఖాతరు చేశారు. ఒక్కో వాహనంలో ఆ ఫీచర్‌ను తొలగించడానికి రెండు గంటల సమయం పడుతుంది. లక్షల కార్లు ఉండటంతో ఈ ప్రాసెస్‌కు మూడు నెలల సమయం పడుతుందని అధికారులు చెప్పారు.