Keeping liquor at home : ఇంట్లో ఎక్కువ మద్యం నిల్వ చేసే వారికి ప్రభుత్వం షాకింగ్ న్యూస్ వినిపించింది. తప్పనిసరిగా లైసెన్స్ తీసుకోవాలని ప్రభుత్వం సూచిస్తోంది. సవరించిన ఎక్సైజ్ మార్గదర్శకాల ప్రకారం పరిమితికి మించి మద్యం కొనుగోలు చేయడానికి, రవాణా చేయడానికి వీలు లేదని వెల్లడిస్తోంది. ఈ మేరకు ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అక్కడి ఎక్సైజ్ శాఖ సవరించిన మార్గదర్శకాల ప్రకారం…
ఆరు లీటర్ల మద్యానికి మాత్రమే అనుమతి ఉందని, అంతకంటే ఎక్కువ నిల్వ చేయాలంటే..తప్పకుండా..ప్రభుత్వ లైసెన్స్ తీసుకోవాలని సూచించింది. రూ. 12 వేలు చెల్లించి..రూ. 51 వేలు సెక్యూర్టీ డిపాజిట్ చేసి లైసెన్స్ పొందాలని వెల్లడించింది. రిటైలర్స్ కు లైసెన్స్ ఫీజును 7.5 శాతం పెంచింది. IMFL ధరను పెంచుతుందని అంచనా వేస్తున్నారు. 750 మి.లీ బాటిల్ (బ్రాండ్ ను బట్టి) రూ. 20 నుంచి రూ. 40 వరకు ఖర్చవుతుందని తెలుస్తోంది.
తక్కువ అల్కాహాల్ పానీయాలను ప్రోత్సాహించడానికి..బీరుపై ఎక్సైజ్ సంకాన్ని తగ్గించింది. స్థానికంగా ఉత్పత్తి చేసే పండ్లతో వైన్ ఉత్పత్తి చేసే వారికి ఎక్సైజ్ సుంకాన్ని ఐదేళ్ల పాటు మినహాయించింది. లాక్ డౌన్ సమయంలో ఎక్సైజ్ శాఖకు జరిగిన ఆదాయ నష్టాలను పూడ్చడానికి యూపీ ప్రభుత్వం ఈ నిర్ణయాలు తీసుకుంది.